వత్సవాయి, పెనుగంచిప్రోలు నూతన ప్రజాప్రతినిధులకు ఘన సన్మానం ఎన్నికైన జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులను అభినందించిన తొండపు దశరథ జనార్దన్
వత్సవాయి మేజర్ న్యూస్:- నవంబరు 14, 2026. స్థానిక సంస్థల ఎన్నికల్లో వత్సవాయి, పెనుగంచిప్రోలు మండలాల నుంచి జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులుగా ఘన విజయం సాధించిన నూతన ప్రజాప్రతినిధులకు ఘన సన్మానం నిర్వహించారు. జాతీయ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ, ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చైర్మన్, జయప్రద ఫౌండేషన్ చైర్మన్ తొండపు దశరథ జనార్దన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులకు శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు అందజేసి ఘనంగా సత్కరించారు. ఎన్నికల్లో విజయం సాధించిన నాయకులకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.
ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గ్రామాల అభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలని దశరథ జనార్దన్ ఆకాంక్షించారు. తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి చేయడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. వత్సవాయి, పెనుగంచిప్రోలు మండలాల సమగ్ర అభివృద్ధి కోసం నూతన ప్రజాప్రతినిధులంతా సమన్వయంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, నూతనంగా ఎన్నికైన జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, వారి అనుచరులు పాల్గొన్నారు.