BREAKING
కిషన్ తాండ సర్పంచ్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత గంజాయి సిగరెట్ సేవించిన వ్యక్తిపై కేసు నమోదు. ఘనంగా జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలు పెద్దకల్వల కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా సలేంద్ర రవి.... తన లాయర్‌ను తప్పుదోవ పట్టించిన ఎన్విడియా మాజీ సీఈఓ జెన్సన్ హువాంగ్ సోషల్ మీడియా వార్నింగ్ లేబుల్ చట్టంపై న్యూయార్క్ ప్రభుత్వంపై కోర్టులో పిటిషన్ అమెరికాలో విమాన సర్వీసులకు పాతబడిన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ పరికరాలు గ్లోబల్ ఔటేజ్‌తో స్తంభించిన మైక్రోసాఫ్ట్ 365, టీమ్స్, ఔట్‌లుక్ సేవలు: వినియోగదారులకు క్షమాపణలు తెలిపిన సంస్థ అమెరికాలో విమానాల నిలిపివేత వెనుక తీవ్రమైన వైమానిక ట్రాఫిక్ సంక్షోభం ఎఫ్‌ఏఏ దేశవ్యాప్త విమానాల నిలిపివేత తర్వాత విమానాశ్రయాల్లో అస్తవ్యస్త పరిస్థితులు రహస్య ప్రాంతంలో యూరోపియన్ యూనియన్ ఆధ్వర్యంలో ఉక్రెయిన్ సైనికులకు అధునాతన యుద్ధ శిక్షణ నర్సాపురం అభివృద్ధికి ఎమ్మెల్యే హామీ 15 రోజుల్లోనే 50% పెరిగిన విమాన ఛార్జీలు: కేంద్రం జోక్యం చేసుకోవాలని ఢిల్లీ వ్యాపార సంఘం విజ్ఞప్తి పండిత్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా నివాళులర్పించిన ప్రధాని మోదీ నష్టాలతో ముగిసిన ఎస్‌అండ్‌పీ 500, నాస్‌డాక్ సూచీలు

ఘనంగా జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలు

Select Suryaa Now
ఘనంగా జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలు

 

పాములపాడు: మేజర్ న్యూస్ 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకుని నవంబర్ 14న బాలల దినోత్సవం సందర్భంగా పాములపాడు శాఖా గ్రంథాలయంలో భారతదేశ తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పాములపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి శ్రీమతి ఈ.వి. నాగలక్ష్మీ దేవి నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని, విద్యార్థులు, యువత గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకొని జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. పుస్తక పఠనం ద్వారా విజ్ఞానంతో పాటు వ్యక్తిత్వ వికాసం కూడా సాధ్యమవుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాఠకులు రవీంద్ర యాదవ్, పరమేష్, నాగేశ్వరరావు, చంద్రుడు, యతిరాజు తదితరులతో పాటు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ వివరాలను గ్రంథాలయాధికారి సి.వి. కృష్ణారెడ్డి తెలిపారు.