BREAKING
తన లాయర్‌ను తప్పుదోవ పట్టించిన ఎన్విడియా మాజీ సీఈఓ జెన్సన్ హువాంగ్ సోషల్ మీడియా వార్నింగ్ లేబుల్ చట్టంపై న్యూయార్క్ ప్రభుత్వంపై కోర్టులో పిటిషన్ అమెరికాలో విమాన సర్వీసులకు పాతబడిన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ పరికరాలు గ్లోబల్ ఔటేజ్‌తో స్తంభించిన మైక్రోసాఫ్ట్ 365, టీమ్స్, ఔట్‌లుక్ సేవలు: వినియోగదారులకు క్షమాపణలు తెలిపిన సంస్థ అమెరికాలో విమానాల నిలిపివేత వెనుక తీవ్రమైన వైమానిక ట్రాఫిక్ సంక్షోభం ఎఫ్‌ఏఏ దేశవ్యాప్త విమానాల నిలిపివేత తర్వాత విమానాశ్రయాల్లో అస్తవ్యస్త పరిస్థితులు రహస్య ప్రాంతంలో యూరోపియన్ యూనియన్ ఆధ్వర్యంలో ఉక్రెయిన్ సైనికులకు అధునాతన యుద్ధ శిక్షణ నర్సాపురం అభివృద్ధికి ఎమ్మెల్యే హామీ 15 రోజుల్లోనే 50% పెరిగిన విమాన ఛార్జీలు: కేంద్రం జోక్యం చేసుకోవాలని ఢిల్లీ వ్యాపార సంఘం విజ్ఞప్తి పండిత్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా నివాళులర్పించిన ప్రధాని మోదీ నష్టాలతో ముగిసిన ఎస్‌అండ్‌పీ 500, నాస్‌డాక్ సూచీలు అత్యంత భక్తిశ్రద్ధలతో ఛత్ పూజ రెండో రోజు 'ఖర్నా' వేడుకలకు సిద్ధమవుతున్న భక్తులు భక్తుల భద్రతలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడొద్దు రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా 'జాతీయ గిరిజన గౌరవ దినోత్సవం' ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల కొద్దీ వినియోగదారులను ప్రభావితం చేసిన అంతరాయంపై క్షమాపణలు కోరిన మైక్రోసాఫ్ట్

నర్సాపురం అభివృద్ధికి ఎమ్మెల్యే హామీ

Select Suryaa Now
నర్సాపురం అభివృద్ధికి ఎమ్మెల్యే హామీ

మూడు అభివృద్ధి పనులకు నిధుల మంజూరుకు భరోసా

రాజపేట:మండలంలోని నర్సాపురం గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు నిధులు మంజూరు చేయాలని సర్పంచ్ ఎమ్మా శిరీష నాగరాజు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యను కోరారు. నూతన గ్రామపంచాయతీ భవనం, ప్రభుత్వ పాఠశాలకు ప్రహరీ గోడ, ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిధులు కేటాయించాలని వినతిపత్రం అందజేశారు. స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరలోనే పనులకు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. గ్రామ అభివృద్ధికి సహకరిస్తానని భరోసా ఇవ్వడంతో సర్పంచ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.