BREAKING
ఆంధ్రప్రదేశ్‌కు రూ. 9.89 లక్షల కోట్ల పెట్టుబడుల హామీలు: 303 ఒప్పందాలపై సంతకాలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఎన్విడియా తదుపరి సీఈఓగా రెనే హాస్? జెన్సెన్ హువాంగ్ వారసుడిపై టెక్ దిగ్గజం కసరత్తు దేశవ్యాప్త ‘గ్రౌండ్‌స్టాప్’….అమెరికాలో విమాన సేవలకు బ్రేక్! పసిడి ప్రియులకు భారీ ఊరట.. అంతులేని పతనంలో బంగారం, వెండి ధరలు! సీఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్ క్యూ2 ఫలితాలు: రూ. 660 కోట్లకు పెరిగిన ఆదాయం, రూ. 81 కోట్ల నికర లాభం నమోదు లింగంపల్లి ఆంజనేయస్వామికి విశేషంగా పూజలు రూ. 8,415 కోట్ల బాండ్ల రద్దు తీర్పుపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసిన యెస్ బ్యాంక్ పంచాయితీ ఎన్నికలైనా సజావుగా జరిగేనా ? Jupiter’s Accelerated Transit in Leo | సింహరాశిలో గురు అతిచారం – వృషభ రాశి ఫలితాలు | డా. ఈడ్పుగంటి పద్మజారాణి Jupiter’s Accelerated Transit in Leo | సింహరాశిలో గురు అతిచారం – మేషరాశి ఫలితాలు | Dr Edupuganti Padmaja Rani సొంత నిధులతో తాగునీటి సమస్యకు పరిష్కారం. నెల రోజులుగా నీటి కోసం గ్రామస్తుల అవస్థలు.. నేడు యథావిధిగా పని చేయనున్న ప్రభుత్వ కార్యాలయాలు . . ఉద్యోగులు కార్యాలయాలకు హాజరు కావాలి :జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ మండలంలో కాంగ్రెస్, బిజెపి పార్టీలకు బిగ్ షాక్ - బిఆర్ఎస్ పార్టీలో భారీగా చేరికలు తీన్మార్ మల్లన్న పాదయాత్ర ప్రమాదంపై సమగ్ర విచారణ జరపాలి:మున్నూరు కాపు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చాట్లపల్లి నర్సింగరావు అలియాబాద్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం

మండలంలో కాంగ్రెస్, బిజెపి పార్టీలకు బిగ్ షాక్ - బిఆర్ఎస్ పార్టీలో భారీగా చేరికలు

Select Suryaa Now
మండలంలో కాంగ్రెస్, బిజెపి పార్టీలకు బిగ్ షాక్ - బిఆర్ఎస్ పార్టీలో భారీగా చేరికలు

సూర్య- బిక్కనూర్ :మండలంలో కాంగ్రెస్ బిజెపి పార్టీలకు శుక్రవారం బిగ్ షాక్ తగిలింది. కంచర్ల గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ పార్టీల నాయకులు తమ తమ పార్టీలకు రాజీనామా చేసి, మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, రైతులు, కూలీలు, యువత తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని,ప్రజల కష్టాలు పట్టించుకోని ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరుగుతోందని ఈ సందర్భంగా వారు ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనలోనే గ్రామాలు అభివృద్ధి చెందాయని, మళ్లీ బిఆర్ఎస్ పార్టీ ప్రజలకు అండగా ఉంటుందని వారు తెలిపారు. పార్టీలో చేరిన వారికి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఇంచార్జి ప్రెసిడెంట్ అత్తేల్లి శ్రీనివాస్, నాయకులు అందె మహేందర్, బోండ్ల రాంచంద్రం, కంచర్ల ఉపసర్పంచ్ రమేష్, మహిపాల్ రెడ్డి, బాపురెడ్డి, నరేందర్, శ్రీనివాస్ గౌడ్, బిక్షపతి, జనార్దన్ రెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు.