అలియాబాద్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం
శామీర్‌పేట, మేజర్ న్యూస్:అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని అలియాబాద్ గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకున్న సోప్పరి విజయ–శ్రీనివాస్ దంపతుల గృహప్రవేశ వేడుక ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అలియాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ కంఠం శిరీష కృష్ణారెడ్డి, మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుంకి రమేష్ హాజరై గృహప్రవేశ కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…పేదల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా నిరుపేద కుటుంబాల సొంతింటి కల నెరవేరుతోందని తెలిపారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇల్లు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం పేదల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతోందని అన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు కోడూరి మౌనిక దినేష్, ముద్దం సుధాకర్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు తంటం యాదగిరి, సంఘనమైన కుమార్ యాదవ్, చిలుగురి మల్లేష్, చాట్లపల్లి నర్సింగరావు, కుడుముల వెంకటేష్, నర్సింహ తదితరులు పాల్గొన్నారు.