BREAKING
కిషన్ తాండ సర్పంచ్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత గంజాయి సిగరెట్ సేవించిన వ్యక్తిపై కేసు నమోదు. ఘనంగా జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలు పెద్దకల్వల కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా సలేంద్ర రవి.... తన లాయర్‌ను తప్పుదోవ పట్టించిన ఎన్విడియా మాజీ సీఈఓ జెన్సన్ హువాంగ్ సోషల్ మీడియా వార్నింగ్ లేబుల్ చట్టంపై న్యూయార్క్ ప్రభుత్వంపై కోర్టులో పిటిషన్ అమెరికాలో విమాన సర్వీసులకు పాతబడిన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ పరికరాలు గ్లోబల్ ఔటేజ్‌తో స్తంభించిన మైక్రోసాఫ్ట్ 365, టీమ్స్, ఔట్‌లుక్ సేవలు: వినియోగదారులకు క్షమాపణలు తెలిపిన సంస్థ అమెరికాలో విమానాల నిలిపివేత వెనుక తీవ్రమైన వైమానిక ట్రాఫిక్ సంక్షోభం ఎఫ్‌ఏఏ దేశవ్యాప్త విమానాల నిలిపివేత తర్వాత విమానాశ్రయాల్లో అస్తవ్యస్త పరిస్థితులు రహస్య ప్రాంతంలో యూరోపియన్ యూనియన్ ఆధ్వర్యంలో ఉక్రెయిన్ సైనికులకు అధునాతన యుద్ధ శిక్షణ నర్సాపురం అభివృద్ధికి ఎమ్మెల్యే హామీ 15 రోజుల్లోనే 50% పెరిగిన విమాన ఛార్జీలు: కేంద్రం జోక్యం చేసుకోవాలని ఢిల్లీ వ్యాపార సంఘం విజ్ఞప్తి పండిత్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా నివాళులర్పించిన ప్రధాని మోదీ నష్టాలతో ముగిసిన ఎస్‌అండ్‌పీ 500, నాస్‌డాక్ సూచీలు

గంజాయి సిగరెట్ సేవించిన వ్యక్తిపై కేసు నమోదు.

Select Suryaa Now
గంజాయి సిగరెట్ సేవించిన వ్యక్తిపై కేసు నమోదు.

సూర్య , నాగిరెడ్డిపేట్ ,గంజాయి సిగరెట్ సేవించిన యువకుడిపై నాగిరెడ్డిపేట పోలీసులు కేసు నమోదు నమోదు చేసినట్లు ఎస్సై భార్గవ్ గౌడ్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని తాండూరు గ్రామానికి చెందిన మేస్త్రీ సంగారెడ్డిపేట ప్రవీణ్ (27) అనే వ్యక్తి శుక్రవారం గంజాయి సిగరెట్ సేవిస్తున్నట్లు నమ్మదగిన సమాచారం మేరకు ఎస్సై తన సిబ్బందితో కలిసి తాండూరు గ్రామం చేరుకొని అతనిని విచారించగా గంజాయి సిగరెట్  సేవించినది వాస్తవమని నిందితుడు ఒప్పుకున్నట్లు ఎస్సై తెలిపారు. గంజాయి సిగరెట్ పై ఆరా తీయగా హైదరాబాదలో తమ బంధువుల శుభకార్యానికి వెళ్లినప్పుడు గుర్తుతెలియని వ్యక్తి గంజాయి సిగరెట్ ఇచ్చినట్లు నిందితుడు తెలిపాడన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్సై భార్గవ్ గౌడ్ తెలిపారు..యువతతో పాటు ప్రజలందరూ గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఎస్సై భార్గవ్ గౌడ్ సూచించారు. మత్తు పదార్థాల వినియోగం ఆరోగ్యంతో పాటు కుటుంబ జీవితం, భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. ఇలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గంజాయి అక్రమ వినియోగం లేదా సరఫరాకు సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.