BREAKING
వెల్దుర్తి అంబేడ్కర్ గురుకులానికి రాష్ట్ర స్థాయి అవార్డు దుండిగల్‌లో వైద్య సేవలకు సిబ్బంది కొరత.. చిన్నారుల టీకాలపై ఆందోళన శాంతి భద్రతల పై రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా సమావేశం మండల పూజలకు సిద్ధమైన శబరిమల.. ఎల్లుండి సాయంత్రం దర్శనాల ప్రారంభం బస్తీల్లో మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా అభివృద్ధి పనులు - ఎమ్మెల్యే తలసాని పాఠశాలకు కూలింగ్‌ క్యాన్లు అందజేత నగర శుభ్రతపై జీహెచ్‌ఎంసీ స్పెషల్ డ్రైవ్ నగర శుభ్రతపై జీహెచ్‌ఎంసీ స్పెషల్ డ్రైవ్ నగర శుభ్రతపై జీహెచ్‌ఎంసీ స్పెషల్ డ్రైవ్ కట్లబండలో సౌర విద్యుత్ వెలుగులు.. 3 మెగావాట్ల ప్లాంట్ ఏర్పాటు ట్రక్ పార్క్ భూముల విక్రయంపై హరీష్ రావు ఆగ్రహం.. కోవూరు నగర్‌లో గుంతల పూడ్చివేత పనులు మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తాం: ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ వ్యాపారంలో రాణించి ఆర్ధికంగా ఎదగాలి *నాయుడ్నూర్ పవన్ రావు ఉత్సాహంగా.. ఉల్లాసంగా *మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్ట్స్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెగా కల్చరల్ ఈవెంట్

మండల పూజలకు సిద్ధమైన శబరిమల.. ఎల్లుండి సాయంత్రం దర్శనాల ప్రారంభం

Select Suryaa Now
మండల పూజలకు సిద్ధమైన శబరిమల.. ఎల్లుండి సాయంత్రం దర్శనాల ప్రారంభం

శబరిమల: వార్షిక మండల-మకరవిళక్కు యాత్ర కోసం శబరిమల శ్రీ ధర్మశాస్తా ఆలయం ముస్తాబైంది. ఎల్లుండి (నవంబర్ 16, సోమవారం) సాయంత్రం 4 గంటలకు ఆలయ తలుపులను తెరవనున్నారు. 17వ తేదీ ఉదయం ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించిన అనంతరం భక్తులను అయ్యప్ప స్వామి దర్శనానికి అనుమతించనున్నారు.

యాత్రకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు (TDB) పలు కీలక ఏర్పాట్లు చేసింది. పంబ నుండి సన్నిధానం వరకు సాగే కొండ ఎక్కే ట్రెక్కింగ్ మార్గంలో భక్తులు సేదతీరేందుకు వీలుగా పలుచోట్ల స్టెయిన్‌లెస్ స్టీల్ సీటింగ్ సౌకర్యాలను కొత్తగా ఏర్పాటు చేశారు.

దీంతో పాటు, యాత్రా సమయంలో భక్తులకు రక్షణ కల్పిస్తూ దేవస్వం బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. యాత్రకు వచ్చిన భక్తులు ఎవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే, వారి కుటుంబాలకు ఆర్థిక భరోసాగా రూ. 2 లక్షల జీవిత బీమా (లైఫ్ ఇన్సూరెన్స్) అందించనున్నట్లు అధికారులు ప్రకటించారు.