మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తాం: ఎమ్మెల్యే కేపీ వివేకానంద్
రూ.1.03 కోట్లతో సీసీ రోడ్లు, పార్కు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
కొంపల్లి మేజర్ న్యూస్ : మౌలిక వసతుల కల్పనతోనే సమగ్ర అభివృద్ధి సాధ్యమని బీఆర్ఎస్ శాసనసభాపక్ష విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. సూరారం డివిజన్ పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్‌లో శుక్రవారం పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఇందులో భాగంగా రూ.68 లక్షల వ్యయంతో నాలుగు నూతన సీసీ రోడ్ల నిర్మాణం, రూ.35.50 లక్షలతో పార్కు అభివృద్ధి పనులను చేపట్టనున్నారు. మొత్తం రూ.1.03 కోట్ల అంచనా వ్యయంతో ఈ పనులు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. గత 12 ఏళ్లుగా నియోజకవర్గంలో కోట్లాది రూపాయల నిధులతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి మౌలిక వసతులను మెరుగుపరిచామని పేర్కొన్నారు. రానున్న రోజుల్లోనూ ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టి రాజీవ్ గాంధీ నగర్‌తో పాటు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు అజయ్ కుమార్ కుంచాల, చైర్మన్ అశోక్, సలహాదారు వేణుగోపాల్, ప్రధాన కార్యదర్శి సిద్ధప్ప, కోశాధికారి పాశం సంపత్ రెడ్డి, ఉపాధ్యక్షులు తాటి విక్రమ్, సంపంగి సతీష్, సభ్యులు నవీన్, వెంకట్, మోబిన్, అవినాష్, శ్రవణ్, గణపతి, ప్రశాంత్, వెంకట్ రావు, మాజీ కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ, డివిజన్ అధ్యక్షుడు పుప్పాల భాస్కర్, ప్రధాన కార్యదర్శి సిద్ధిక్, సీనియర్ నాయకులు కొండకళ్ల శ్రీనివాస్ రెడ్డి, దొడ్ల శ్రీను, కోల శ్రీకాంత్ ముదిరాజ్, ఇతర నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు.