సెవెంత్ డే అడ్వెంటిస్ట్ హైస్కూల్లో ఘనంగా చిల్డ్రన్స్ డే వేడుకలు
సికింద్రాబాద్ మేజర్ న్యూస్ : చిల్డ్రన్స్ డే సందర్భంగా చిన్నారులు ఉపాధ్యాయుల సమక్షంలో ఘనంగా చిల్డ్రన్స్ వేడుకలు నిర్వహించారు సికింద్రాబాద్ ఎస్ డి రోడ్ లోని సెవెంత్ డే అడ్వెంటిస్ట్ హైస్కూల్లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. విద్యార్థిని విద్యార్థులు దేశభక్తి గేయాలు పాడుతూ అందరిని మైమరిపించారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం సమ సమాజం కోసం విద్యార్థు లు ఎంతో కష్టపడాల్సిందని ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ విజయ్ కుమార్ రాజా విద్యార్థులకు సూచించారు. క్రమశిక్షణ పట్టుదల ఓర్పు విద్యార్థులకు ఎంతో అవసరమని ఈ నిబంధనలను ప్రతి విద్యార్థి పాటించాలని ఆయన కోరారు. విద్యార్థులు విద్యాపై ప్రత్యేక ప్రత్యేక శ్రద్ధ వహించి సమాజంలో పేరు ప్రతిష్టలు తో పాటు తల్లిదండ్రులకు ఇటు ఉపాధ్యాయులకు గుర్తింపు తీసుకురావాలని ప్రిన్సిపల్ విజయ్ కుమార్ రాజా కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ప్రసన్నకుమార్, సూపర్వైజర్ వనజ విజయ్ కుమార్ రాజా, ఉపాధ్యాయురాలు డివిడి లక్ష్మి శిరోమణి, ఝాన్సీ ,సుజాత అపర్ణ, రోస గ్లోరీ, మౌని, జీవ, అజిత, సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.