telangana
కట్లబండలో సౌర విద్యుత్ వెలుగులు.. 3 మెగావాట్ల ప్లాంట్ ఏర్పాటు
- ప్రధానమంత్రి కుసుమ్ యోజన కింద నిర్మాణం
- 8.20 ఎకరాల్లో సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రం
- సుమారు 100 ట్రాన్స్‌ఫార్మర్లకు విద్యుత్ సరఫరా చేసే సామర్థ్యం
ఉప్పునుంతల, సూర్య న్యూస్:
పునరుత్పాదక ఇంధన వనరులను ప్రోత్సహించడంతో పాటు రైతులకు, విద్యుత్ రంగానికి ప్రయోజనం చేకూర్చే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్థాన్ మహాభియాన్ (PM-KUSUM) పథకం కింద ఉప్పునుంతల మండలంలో సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. మండల పరిధిలోని కట్లబండ గ్రామ శివారులో లత్తిపూర్ గ్రామానికి చెందిన జయశ్రీ, శ్రావణ్ కుమార్ రెడ్డి 8.20 ఎకరాల భూమిలో ఈ ప్లాంట్‌ను నిర్మించారు.ఈ సౌర విద్యుత్ ప్లాంట్ ద్వారా మూడు మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కానుంది. ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను సుమారు 100 ట్రాన్స్‌ఫార్మర్లకు సరఫరా చేయగల సామర్థ్యం ఈ ప్లాంట్‌కు ఉందని నిర్వాహకులు తెలిపారు. సౌర విద్యుత్ ఉత్పత్తి ద్వారా సంప్రదాయ విద్యుత్ వనరులపై ఆధారపడటాన్ని తగ్గించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు దోహదపడనుంది.ఈ కార్యక్రమంలో సోలార్ విద్యుత్ శాఖ ఎస్‌ఈ కేవీ నర్సింహారెడ్డి, డీఈ ఎం. సుధాకర్, ఏడీఈ రత్లావత్ శ్రీను, ఏఈ అప్పలనాయుడు, డీఈ (ఎం అండ్ పి) శ్రీనివాసులు, సోలార్ టెక్నీషియన్లు, రమాకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.