BREAKING
వెల్దుర్తి అంబేడ్కర్ గురుకులానికి రాష్ట్ర స్థాయి అవార్డు దుండిగల్‌లో వైద్య సేవలకు సిబ్బంది కొరత.. చిన్నారుల టీకాలపై ఆందోళన శాంతి భద్రతల పై రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా సమావేశం మండల పూజలకు సిద్ధమైన శబరిమల.. ఎల్లుండి సాయంత్రం దర్శనాల ప్రారంభం బస్తీల్లో మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా అభివృద్ధి పనులు - ఎమ్మెల్యే తలసాని పాఠశాలకు కూలింగ్‌ క్యాన్లు అందజేత నగర శుభ్రతపై జీహెచ్‌ఎంసీ స్పెషల్ డ్రైవ్ నగర శుభ్రతపై జీహెచ్‌ఎంసీ స్పెషల్ డ్రైవ్ నగర శుభ్రతపై జీహెచ్‌ఎంసీ స్పెషల్ డ్రైవ్ కట్లబండలో సౌర విద్యుత్ వెలుగులు.. 3 మెగావాట్ల ప్లాంట్ ఏర్పాటు ట్రక్ పార్క్ భూముల విక్రయంపై హరీష్ రావు ఆగ్రహం.. కోవూరు నగర్‌లో గుంతల పూడ్చివేత పనులు మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తాం: ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ వ్యాపారంలో రాణించి ఆర్ధికంగా ఎదగాలి *నాయుడ్నూర్ పవన్ రావు ఉత్సాహంగా.. ఉల్లాసంగా *మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్ట్స్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెగా కల్చరల్ ఈవెంట్

బస్తీల్లో మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా అభివృద్ధి పనులు - ఎమ్మెల్యే తలసాని

Select Suryaa Now
బస్తీల్లో మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా అభివృద్ధి పనులు - ఎమ్మెల్యే తలసాని

 

సికింద్రాబాద్ మేజర్ న్యూస్ : ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అందుకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శుక్రవారం బేగంపేట డివిజన్ లోని వికార్ నగర్, వడ్డెర బస్తీ లలో 26 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. అనంతరం స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నట్లు చెప్పారు. బస్తీ లు, కాలనీలు అనే తేడా లేకుండా రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక సౌకర్యాలను కల్పిస్తూ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరిస్తున్నట్లు వివరించారు. వికార్ నగర్ లోని డ్రైనేజీ సమస్యకు కూడా త్వరలోనే శాశ్వత పరిష్కారం చూపనున్నట్లు చెప్పారు. సమస్య పరిష్కారం కోసం తీసుకోవాల్సిన చర్యలపై ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు చెప్పారు. వీలైనంత త్వరగా నిధులు మంజూరు చేయించి పనులు చేపట్టడం జరుగుతుందని అన్నారు. డ్రైనేజీ నిర్మాణ పనులు చేసిన అనంతరం రోడ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ టి. మహేశ్వరి, జిహెచ్ఎంసి డి ఈ మహేష్, వాటర్ వర్క్స్ డి జి ఎం ఆశిష్, శానిటేషన్ డి ఈ వెంకటేశం, హార్టికల్చర్ అధికారి రోహిత్, డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, నాయకులు టి.శ్రీహరి, నరేందర్, శేఖర్, అఖిల్, నాగరాజు గౌడ్, జావీద్, బంటి, గిరి, ఎల్ల స్వామి, నసీమా బేగం, శారద తదితరులు ఉన్నారు.