వ్యాపారంలో రాణించి ఆర్ధికంగా ఎదగాలి *నాయుడ్నూర్ పవన్ రావు
మల్కాజిగిరి, మేజర్ న్యూస్: యువత స్వయం ఉపాధి రంగాలను ఎంచుకుని వ్యాపారాల్లో నిలదొక్కుకొని ఆర్ధికంగా బ ఎదగాలని నాయుడ్నూర్ పవన్ రావు ఆకాంక్షించారు. శుక్రవారం రాత్రి మౌలాలి డివిజన్ పరిధిలోని శ్రామిక్ నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసుకున్న 'జై భవాని ఎంటర్ ప్రైజెస్' నూతన కార్యాలయ ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథి గా హజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదరు చూడకుండా ఏదైనా దుకాణం పెట్టుకుని ఆర్ధికంగా ఉన్నత స్థానా న్ని అధిరోహించాలని ఆకాంక్షించారు. వ్యాపా రాల్లో నిలదొక్కుకుంటే ఆర్థికంగా అభివృద్ధి సాధించవచ్చునన్నారు. యువత అనుకుం టే సాధించలేనిది ఏదీ లేదన్నారు. స్వయం ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకొని, తక్కువ పెట్టుబడితో వ్యాపారం చేసి,దండిగా డబ్బుల సంపాదించటంతో పాటుగా, మంచి పేరు సంపాదించుకోవాలని ఆయన సూచిం చారు. దుకాణానికి వచ్చే వినియోగదారు లకు మెరుగైన సేవలందిస్తూ వారి ఆదరా భిమానాలు పొందాలని తద్వారా వ్యాపారం మరింత వృద్ధిలోకి వస్తుందన్నారు. ఈ సంద ర్భంగా 'జై భవాని ఎంటర్ ప్రైజెస్' నిర్వాహ కులకు ఆయన బెస్ట్ విషెస్ తెలియజేశారు. 'జై భవాని ఎంటర్ ప్రైజెస్' నిర్వాహకులు ఏర్పుల మధన్ మూర్తి, జానకీరామ్ సాగర్, రాందాస్ నాగరాజు, ఎరుగు బాలస్వామి మాట్లాడుతూ..తమ హితుడు, శ్రేయోభిలాషి, ఆత్మీయులు, నాయుడ్నూర్ పవన్ రావు తాము ఏర్పాటు చేసుకున్న ఈ నూతన కార్యాలయం ప్రారంభోత్సవానికి రావటం, ఆయన చేతులు మీదుగా ప్రారంభానికి నోచుకోవటం తమందరికి ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ చిన్ని శుభకార్యక్రమానికి తన విలువైన సమయాన్ని కేటాయించడమే కాకుండా, నూతన కార్యాలయ ఏర్పాటుకు అందించిన సహకారం, మద్దతు ప్రోత్సాహం మాకు ఎంతో స్ఫూర్తినిచ్చాయని ఈ సంద ర్భంగా వారు, ఆయనకు కృతజ్ఞతలు తెలి పారు. భవిష్యత్తులో కూడా ఆయన ఆశీస్సు లు, సహాయ సహకారాలు తమపై ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మన్నారు