BREAKING
శాంతి భద్రతల పై రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా సమావేశం మండల పూజలకు సిద్ధమైన శబరిమల.. ఎల్లుండి సాయంత్రం దర్శనాల ప్రారంభం బస్తీల్లో మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా అభివృద్ధి పనులు - ఎమ్మెల్యే తలసాని పాఠశాలకు కూలింగ్‌ క్యాన్లు అందజేత నగర శుభ్రతపై జీహెచ్‌ఎంసీ స్పెషల్ డ్రైవ్ నగర శుభ్రతపై జీహెచ్‌ఎంసీ స్పెషల్ డ్రైవ్ నగర శుభ్రతపై జీహెచ్‌ఎంసీ స్పెషల్ డ్రైవ్ కట్లబండలో సౌర విద్యుత్ వెలుగులు.. 3 మెగావాట్ల ప్లాంట్ ఏర్పాటు ట్రక్ పార్క్ భూముల విక్రయంపై హరీష్ రావు ఆగ్రహం.. కోవూరు నగర్‌లో గుంతల పూడ్చివేత పనులు మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తాం: ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ వ్యాపారంలో రాణించి ఆర్ధికంగా ఎదగాలి *నాయుడ్నూర్ పవన్ రావు ఉత్సాహంగా.. ఉల్లాసంగా *మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్ట్స్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెగా కల్చరల్ ఈవెంట్ సెవెంత్ డే అడ్వెంటిస్ట్ హైస్కూల్లో ఘనంగా చిల్డ్రన్స్ డే వేడుకలు కౌకూర్ గ్రామం కింది బస్తీలోవర్షం నిరు, వర్షపు నీటి కాలువల పనులను పరిశీలించిన బి. ఆర్. ఎస్. నాయకులు.

ఉత్సాహంగా.. ఉల్లాసంగా *మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్ట్స్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెగా కల్చరల్ ఈవెంట్

Select Suryaa Now
ఉత్సాహంగా.. ఉల్లాసంగా  *మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్ట్స్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెగా కల్చరల్ ఈవెంట్

రవీంద్ర భారతి, మేజర్ న్యూస్ 13: న్యాయవాదులలో దాగి ఉన్న కళా సాంస్కృతిక ప్రతిభను వెలికితీస్తూ.. వృత్తిపరమైన ఐక్యతను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్ట్స్ బార్ అసోసియేషన్ (ఎంసీసీబీఏ ) ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా కల్చరల్ ఈవెంట్ హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ హై కోర్టు న్యాయమూర్తి జస్టిస్ విజయసేన్ రెడ్డి, గౌరవ అతిథిలుగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్. రాజేశ్వర్ రావు, సీబీఐ న్యాయమూర్తి జస్టిస్ డా. పట్టాభి రామారావు, సెషన్ జడ్జి సాయి రామ దేవి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అనునిత్యం న్యాయస్థానాల్లో కేసుల వాదనలు, వృత్తిపరమైన బాధ్యతలతో బిజీగా ఉండే న్యాయవాదులు ఈ వేడుకలో తమలోని కళాత్మక ప్రతిభను ప్రదర్శించి అందరినీ ఆకట్టుకోవడం సంతోషదాయకమన్నారు. వృత్తిపరమైన జీవితానికి భిన్నంగా కళలు, వినోద కార్యక్రమాలతో సంతోషంగా గడిపిన ఈ వేడుక న్యాయవాదుల మధ్య స్నేహభావాన్ని, ఐక్యతను మరింత పెంపొందించిందన్నారు. సభకు ముందు వివిధ సాంస్కృతిక ప్రదర్శనల్లో న్యాయవాదులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రెట్టాల బాలరాజ్ గౌడ్ ఉపాధ్యక్షులు నరేష్ కుమార్ పి.ఎల్., బాబితా పవార్ (మహిళా విభాగం) జనరల్ సెక్రటరి వేణుగోపాల్ రాజంపేట, జాయింట్ సెక్రటరీలు చంద్రశేఖర్ టి., సంధ్యారాణి ఎం. (మహిళా విభాగం) లైబ్రరీ సెక్రటరి సత్య నారాయణ, కోశాధికారి విద్యాసాగర్ , అక్కపాక , స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీ బొడ్డుపల్లి శ్రీనివాస్, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీ (మహిళా విభాగం) రమా సుభద్ర ఎస్. ఎం.ప్రమీల ఎక్స్- ఆఫీషియో మెంబర్ కె. రవి కిషోర్, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు కుమారి కొమ్ము, సోని యరగాని, నవీన్ కుమార్ డి. క్రాంతి కుమార్ వి.నవనీత్ సింగ్ డి.కె. రాజీవ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.