BREAKING
హెచ్‌ఎండీఏ భూముల ఈ-వేలం ప్రీ-బిడ్ సమావేశం తేదీ మార్పు నిబంధనలకు విరుద్ధంగా పెట్రోల్ బంక్ నిర్మిస్తున్నారని కలెక్టర్ కు ఫిర్యాదు ప్రభుత్వ గిరిజన ప్రాథమిక పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన....సర్పంచ్ పెద్దకొండూరులో ఉచిత వైద్య శిబిరం అప్పు డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగినందుకు తండ్రీకొడుకులపై దాడి.. ఇద్దరికీ తీవ్ర గాయాలు ప్రగతి నగర్ ప్రభుత్వ పాఠశాల భూ పరిరక్షణకు భారీ ర్యాలీ* జెడ్ కొత్తపల్లి సమీపంలో ఆటో బోల్తా 9 మందికి గాయాలు జిల్లా ఆసుపత్రి మార్చురీ అపరిశుభ్రతపై ప్రభుత్వ విప్ బీర్ల ఆగ్రహం దూలపల్లి–జీడిమెట్ల రోడ్డు విస్తరణకు వేగం పెంచాలి రవీంద్రభారతిలో ఘనంగా న్యాయవాదుల సంగీత విభావరి నిర్మాణ రంగానికి గ్రీన్ వాటర్ ట్యాంకర్లు.. తాగునీటికి బదులుగా శుద్ధి జలాల వినియోగం! మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తాం: ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గిగ్ వర్కర్స్ ర్యాలీని ప్రారంభించిన రాహుల్ గాంధీ.. రాష్ట్రంలో గిగ్ వర్కర్స్ పాలసీకి శ్రీకారం వత్సవాయి, పెనుగంచిప్రోలు నూతన ప్రజాప్రతినిధులకు ఘన సన్మానం ఎన్నికైన జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులను అభినందించిన తొండపు దశరథ జనార్దన్

దూలపల్లి–జీడిమెట్ల రోడ్డు విస్తరణకు వేగం పెంచాలి

Select Suryaa Now
దూలపల్లి–జీడిమెట్ల రోడ్డు విస్తరణకు వేగం పెంచాలి

                      పోల్‌ షిఫ్టింగ్, చెట్ల తరలింపు పనులను వెంటనే పూర్తి చేయాలి..

                                    అధికారులకు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ఆదేశం

కొంపల్లి మేజర్ న్యూస్ :    కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో ప్రతిష్టంభనకు గురైన దూలపల్లి–జీడిమెట్ల పారిశ్రామికవాడ రోడ్డు విస్తరణ పనులను నిర్ణీత కాలవ్యవధిలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని బీఆర్‌ఎస్‌ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అధికారులను ఆదేశించారు. రోడ్డు విస్తరణకు అడ్డుగా ఉన్న విద్యుత్‌ స్తంభాలను ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో తరలించడంతో పాటు చెట్లను కొట్టివేయకుండా ఇతర ప్రాంతాలకు తరలించే ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. దూలపల్లి ఎన్టీఆర్‌ చౌరస్తా నుంచి జీడిమెట్ల ఐలా పారిశ్రామికవాడ మీదుగా చేపడుతున్న రోడ్డు నిర్మాణ పనుల్లో నెలకొన్న ప్రతిష్టంభనపై పేట్‌ బషీరాబాద్‌లోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్డు విస్తరణ పనుల ప్రస్తుత పరిస్థితి, ఇప్పటివరకు పూర్తయిన పనులు, ఇంకా చేపట్టాల్సిన చర్యలపై అధికారులు ఎమ్మెల్యేకు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దూలపల్లి పారిశ్రామికవాడ రోడ్డు అభివృద్ధి జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతంతో పాటు కొంపల్లి పరిసర ప్రాంతాల ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. పారిశ్రామికవాడకు నిత్యం రాకపోకలు సాగించే వాహనదారులు, స్థానిక ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పనులను వేగంగా పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. దాదాపు 2.20 కిలోమీటర్ల పొడవు, 50 అడుగుల వెడల్పుతో మూడు ప్యాకేజీలుగా సుమారు రూ.10.90 కోట్ల వ్యయంతో చేపడుతున్న ఈ రోడ్డు విస్తరణ పనుల్లో విద్యుత్‌ స్తంభాలు అడ్డంకిగా మారుతున్నాయని తెలిపారు. పోల్‌ షిఫ్టింగ్‌ కోసం ఇప్పటికే రూ.1.80 కోట్ల నిధులు మంజూరయ్యాయని, ఇంజినీరింగ్‌ అధికారులు విద్యుత్‌ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుని స్తంభాల తరలింపు పనులను వెంటనే చేపట్టి పూర్తి చేయాలని ఆదేశించారు. అదేవిధంగా రోడ్డు విస్తరణలో అడ్డుగా ఉన్న సుమారు 210 చెట్లను కొట్టివేయకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో ఇతర ప్రాంతాలకు తరలించాలని సూచించారు. అటవీ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుని చెట్ల తరలింపు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూనే రోడ్డు అభివృద్ధి పనులకు ఎలాంటి ఆటంకం లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు. రోడ్డు విస్తరణ పనులను వేగంగా పూర్తి చేయాలంటే వివిధ శాఖల మధ్య సమన్వయం అత్యంత కీలకమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. విద్యుత్‌, వాటర్‌వర్క్స్‌, అటవీ, ఇంజినీరింగ్‌, ట్రాఫిక్‌ తదితర శాఖల అధికారులు పరస్పరం సమన్వయం చేసుకుంటూ పెండింగ్‌ సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తానని ఆయన తెలిపారు. రోడ్డు విస్తరణ పనులు కొనసాగుతున్న సమయంలో వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేసి ట్రాఫిక్‌ రద్దీని నియంత్రించాలని ట్రాఫిక్‌ అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. నిర్మాణ పనుల కారణంగా ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. దూలపల్లి–జీడిమెట్ల పారిశ్రామికవాడ రోడ్డు విస్తరణ పూర్తయితే పారిశ్రామిక ప్రాంతానికి రాకపోకలు మరింత సులభతరం కావడంతో పాటు ట్రాఫిక్‌ సమస్యలు కూడా కొంతవరకు తగ్గే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. దీంతో పెండింగ్‌లో ఉన్న పనులను అన్ని శాఖలు సమన్వయంతో పూర్తి చేసి నిర్ణీత గడువులో రోడ్డును ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ స్పష్టం చేశారు. ఈ సమీక్షా సమావేశంలో ఎస్‌ఈ సక్కుబాయి, కొంపల్లి డీసీ లావణ్య, టీజీఎస్‌పీడీసీఎల్‌ ఎలక్ట్రికల్‌ డీఈ (కన్స్ట్రక్షన్‌) సత్యమ్మ, వాటర్‌వర్క్స్‌ జీఎం మాధవి, ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ కొండల్‌రెడ్డి, ట్రాఫిక్‌ అధికారులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.