ప్రభుత్వ గిరిజన ప్రాథమిక పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు
సూర్య బెజ్జుర్ :కొమరం బీమ్ ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం అందుగుల గూడ గ్రామపంచాయతీ లోని పర్ధాన్ గూడ లోని ప్రభుత్వ గిరిజన ప్రాథమిక పాఠశాలలో బాలల దినోత్సవ కార్యక్రమం ను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పండిట్ జవహర్ లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాములు మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులు కావున ప్రతి ఒక్క విద్యార్థి క్రమశిక్షణతో విద్య నేర్చుకుని సమాజానికి తమ వంతుగా సహాయ పడాలని సూచించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు