జెడ్ కొత్తపల్లి సమీపంలో ఆటో బోల్తా 9 మందికి గాయాలు
బి. మఠం మేజర్ న్యూస్ కడప జిల్లా: బ్రహ్మంగారిమఠం మండల పరిధిలోని జెడ్ కొత్తపల్లి సమీపంలో 67వ జాతీయ రహదారిపై ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 9 మందికి గాయాలయ్యాయి.
క్షతగాత్రులంతా ప్రొద్దుటూరు మండలం చౌడూరుకు చెందిన వారుగా గుర్తింపు.ప్రొద్దుటూరు నుండి పెంచలకోనకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.ఆటో బోల్తా పడిన ఘటనలో ఐదుగురికి తీవ్ర గాయాలు, నలుగురికి సాధారణ గాయాలు అయ్యాయి.హైవే అంబులెన్స్ 1033లో క్షతగాత్రులను మైదుకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అక్కడి నుండి ప్రొద్దుటూరుకు తరలించారు.
రిపోర్టర్ కడప జిల్లా బి.మఠం రామిరెడ్డి