BREAKING
మోమిన్‌పేట ఎస్సైపై సీసీఎస్‌లో కేసు నమోదు వికారాబాద్ లో ఏవీఎం ఎస్ కేర్ హాస్పిటల్' ప్రారంభం 16న కలెక్టరేట్‌లో పిల్లల ప్రజావాణి: జిల్లా కలెక్టర్ దీపక్ తివారి అధికారులు నిర్లక్ష్యం... ఆసరా కోల్పోయిన దివ్యాంగురాలు ఆటపాటలతో అలరించిన బాలల దినోత్సవ వేడుకలు ముంచుకొస్తున్న ముప్పు..!! కొత్త రాయల్టీ విధానంతో ఆయిల్ శాండ్స్ పెట్టుబడులు పెరుగుతాయన్న అల్బెర్టా ప్రభుత్వం చైనా ఎదుగుదలకు దక్షిణ కొరియా భయపడాల్సిన అవసరం లేదు అమెరికాలో గంటల తరబడి నిలిచిపోయిన విమాన సర్వీసులు కిషన్ తాండ సర్పంచ్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత గంజాయి సిగరెట్ సేవించిన వ్యక్తిపై కేసు నమోదు. ఘనంగా జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలు పెద్దకల్వల కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా సలేంద్ర రవి.... తన లాయర్‌ను తప్పుదోవ పట్టించిన ఎన్విడియా మాజీ సీఈఓ జెన్సన్ హువాంగ్ సోషల్ మీడియా వార్నింగ్ లేబుల్ చట్టంపై న్యూయార్క్ ప్రభుత్వంపై కోర్టులో పిటిషన్

ముంచుకొస్తున్న ముప్పు..!!

Select Suryaa Now
ముంచుకొస్తున్న ముప్పు..!!

బంగాళాఖాతంలో మరో తుఫాన్‌ అలజడి!

ఈ నెల 16 నాటికి తుఫాన్‌గా బలపడే అవకాశం

ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా వైపు పయనించే సూచనలు.. తీరం దిశపై ఇంకా స్పష్టత కరువు

విశాఖపట్నం : సూర్య

బంగాళాఖాతంలో మరో తుఫాన్‌ ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే అర్ణబ్‌, మురసు తుఫాన్ల ప్రభావం నుంచి తీరప్రాంత ప్రజలు పూర్తిగా కోలుకోకముందే మరో అల్పపీడనం ఏర్పడటం ఆందోళన కలిగిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతూ ఈ నెల 16 నాటికి తుఫాన్‌గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ తుఫాన్‌కు ఇరాన్‌ సూచించిన 'అక్వాన్‌' అనే పేరు పెట్టనున్నారు.

౼ అల్పపీడనం నుంచి తుఫాన్‌గా..

నైరుతి బంగాళాఖాతం, అండమాన్‌ సముద్ర పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నవంబర్‌ 13న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది వాయువ్య దిశగా కదులుతూ నవంబర్‌ 14 నాటికి మరింత బలపడే అవకాశం ఉంది. నవంబర్‌ 15 నాటికి వాయుగుండంగా, 16వ తేదీ సాయంత్రానికి తుఫాన్‌గా మారవచ్చని వాతావరణ అంచనాలు వెల్లడిస్తున్నాయి.

౼ ఉత్తరాంధ్ర వైపు మళ్లుతుందా?

ప్రస్తుత వాతావరణ నమూనాల ప్రకారం తుఫాన్‌ ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల వైపు కదిలే అవకాశాలున్నట్లు కొన్ని అంచనాలు చెబుతున్నాయి. అయితే మరికొన్ని వాతావరణ నమూనాలు దిశ మార్పును సూచిస్తున్నాయి. బంగ్లాదేశ్‌ లేదా మయన్మార్‌ వైపు వెళ్లే అవకాశాలను కూడా కొట్టిపారేయలేమని నిపుణులు పేర్కొంటున్నారు. తుఫాన్‌ ఏర్పడిన తర్వాతే దాని ప్రయాణ దిశ, తీవ్రత, తీరం దాటే ప్రాంతంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

౼ మత్స్యకారులకు అప్రమత్తంగా ఉండాలి

బంగాళాఖాతంలో గాలుల వేగం క్రమంగా పెరిగే అవకాశం ఉంది. నవంబర్‌ 15 నుంచి 17 వరకు నైరుతి బంగాళాఖాతంలో గంటకు 55 కిలోమీటర్ల వేగంతో గాలులు, గంటకు 65 కిలోమీటర్ల వరకు గరిష్ఠ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముంది. సముద్రం అలజడిగా మారే సూచనల నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లే విషయంలో అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.

౼ 19 నుంచి వర్షాలు కురిసే అవకాశం

తుఫాన్‌ ప్రయాణ దిశను బట్టి ఈ నెల 19వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాథమిక వాతావరణ అంచనాలు సూచిస్తున్నాయి. అయితే తీరాన్ని తాకే ప్రాంతం, వర్షాల తీవ్రతపై ఇంకా అధికారిక స్పష్టత రావాల్సి ఉంది. వాతావరణ శాఖ తాజా హెచ్చరికల కోసం తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.