BREAKING
మోమిన్‌పేట ఎస్సైపై సీసీఎస్‌లో కేసు నమోదు వికారాబాద్ లో ఏవీఎం ఎస్ కేర్ హాస్పిటల్' ప్రారంభం 16న కలెక్టరేట్‌లో పిల్లల ప్రజావాణి: జిల్లా కలెక్టర్ దీపక్ తివారి అధికారులు నిర్లక్ష్యం... ఆసరా కోల్పోయిన దివ్యాంగురాలు ఆటపాటలతో అలరించిన బాలల దినోత్సవ వేడుకలు ముంచుకొస్తున్న ముప్పు..!! కొత్త రాయల్టీ విధానంతో ఆయిల్ శాండ్స్ పెట్టుబడులు పెరుగుతాయన్న అల్బెర్టా ప్రభుత్వం చైనా ఎదుగుదలకు దక్షిణ కొరియా భయపడాల్సిన అవసరం లేదు అమెరికాలో గంటల తరబడి నిలిచిపోయిన విమాన సర్వీసులు కిషన్ తాండ సర్పంచ్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత గంజాయి సిగరెట్ సేవించిన వ్యక్తిపై కేసు నమోదు. ఘనంగా జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలు పెద్దకల్వల కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా సలేంద్ర రవి.... తన లాయర్‌ను తప్పుదోవ పట్టించిన ఎన్విడియా మాజీ సీఈఓ జెన్సన్ హువాంగ్ సోషల్ మీడియా వార్నింగ్ లేబుల్ చట్టంపై న్యూయార్క్ ప్రభుత్వంపై కోర్టులో పిటిషన్

16న కలెక్టరేట్‌లో పిల్లల ప్రజావాణి: జిల్లా కలెక్టర్ దీపక్ తివారి

Select Suryaa Now
16న కలెక్టరేట్‌లో పిల్లల ప్రజావాణి: జిల్లా కలెక్టర్ దీపక్ తివారి

వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్: బాలల హక్కుల వారోత్సవాలను పురస్కరించుకొని ఈనెల 16వ తేదీ సోమవారం వికారాబాద్ కలెక్టరేట్‌లో ప్రత్యేకంగా పిల్లల ప్రజావాణి నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ దీపక్ తివారి తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.బాలల హక్కులపై సమాజంలో అవగాహన పెంపొందించడంతో పాటు పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై ప్రతి ఒక్కరిలో బాధ్యతను పెంపొందించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆదేశాల మేరకు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే సాధారణ ప్రజావాణి ప్రాంగణంలోనే పిల్లల కోసం ప్రత్యేక డెస్క్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. పిల్లలు తమ విద్య, ఆరోగ్యం, పోషణ, రక్షణ, ప్రాథమిక సౌకర్యాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి తదితర అంశాలపై నేరుగా తమ సమస్యలను అధికారులకు తెలియజేయవచ్చని, వినతిపత్రాలు సమర్పించవచ్చని కలెక్టర్ సూచించారు. పిల్లల సమస్యల పరిష్కారానికి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.