BREAKING
మోమిన్‌పేట ఎస్సైపై సీసీఎస్‌లో కేసు నమోదు వికారాబాద్ లో ఏవీఎం ఎస్ కేర్ హాస్పిటల్' ప్రారంభం 16న కలెక్టరేట్‌లో పిల్లల ప్రజావాణి: జిల్లా కలెక్టర్ దీపక్ తివారి అధికారులు నిర్లక్ష్యం... ఆసరా కోల్పోయిన దివ్యాంగురాలు ఆటపాటలతో అలరించిన బాలల దినోత్సవ వేడుకలు ముంచుకొస్తున్న ముప్పు..!! కొత్త రాయల్టీ విధానంతో ఆయిల్ శాండ్స్ పెట్టుబడులు పెరుగుతాయన్న అల్బెర్టా ప్రభుత్వం చైనా ఎదుగుదలకు దక్షిణ కొరియా భయపడాల్సిన అవసరం లేదు అమెరికాలో గంటల తరబడి నిలిచిపోయిన విమాన సర్వీసులు కిషన్ తాండ సర్పంచ్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత గంజాయి సిగరెట్ సేవించిన వ్యక్తిపై కేసు నమోదు. ఘనంగా జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలు పెద్దకల్వల కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా సలేంద్ర రవి.... తన లాయర్‌ను తప్పుదోవ పట్టించిన ఎన్విడియా మాజీ సీఈఓ జెన్సన్ హువాంగ్ సోషల్ మీడియా వార్నింగ్ లేబుల్ చట్టంపై న్యూయార్క్ ప్రభుత్వంపై కోర్టులో పిటిషన్

అధికారులు నిర్లక్ష్యం... ఆసరా కోల్పోయిన దివ్యాంగురాలు

Select Suryaa Now
అధికారులు నిర్లక్ష్యం... ఆసరా కోల్పోయిన దివ్యాంగురాలు

90 శాతం వైకల్యం ఉన్నా అధికారులకు కనికరం లేదా..?

అధికారుల నిర్లక్ష్యానికి బలైన వికలాంగురాలి పింఛన్!

అర్హత ఉన్నా జాబితాలో దక్కని చోటు..

న్యాయం కోసం ఎంపీడీవో కార్యాలయం ఎదుట బైఠాయింపు

అధికారుల తీరుపై బాధిత కుటుంబం తీవ్ర ఆగ్రహం


పెనుబల్లి, సూర్య మేజర్ న్యూస్:

(కిరణ్ కుమార్ ఆరిక )
అధికారుల నిర్లక్ష్యం ఓ నిరుపేద కుటుంబానికి శాపంగా మారిందా..? 90 శాతం మానసిక వైకల్యంతో బాధపడుతున్న వికలాంగురాలికి పింఛన్ అందించడంలో అధికారుల అలసత్వం అడ్డంకిగా మారిందా..? అన్ని అర్హతలు ఉన్నప్పటికీ పెన్షన్ జాబితాలో పేరు గల్లంతవడంతో బాధిత కుటుంబం తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. అధికారుల తప్పిదం వల్లే తమ కుమార్తెకు రావాల్సిన పింఛన్ కోల్పోయామని ఆరోపిస్తూ తండ్రి తన మానసిక వికలాంగురాలైన కుమార్తెతో కలిసి శుక్రవారం పెనుబల్లి ఎంపీడీవో కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
వివరాల్లోకి వెళితే.. పెనుబల్లి గ్రామంలోని బీసీ కాలనీకి చెందిన నిరుపేద దంపతులు బెజవాడ వెంకటేశ్వరరావు, అరుణలకు ఒక్కగానొక్క కుమార్తె ఉమారాణి ఉంది. ఆమె 90 శాతం మానసిక వైకల్యంతో బాధపడుతోంది. ప్రభుత్వం నూతనంగా వికలాంగుల పింఛన్ల కోసం దరఖాస్తులు ఆహ్వానించడంతో, తమ కుమార్తెకు పింఛన్ వస్తుందనే ఆశతో తల్లిదండ్రులు అవసరమైన అన్ని ధ్రువపత్రాలతో పాటు సదరం సర్టిఫికెట్‌ను జతచేసి 2026 మార్చి 31న ఎంపీడీవో కార్యాలయంలో దరఖాస్తు సమర్పించారు.
అయితే ప్రభుత్వం అర్హులైన వికలాంగులకు పింఛన్లు మంజూరు చేసే ప్రక్రియ చేపట్టి, పెనుబల్లి గ్రామంలో 47 మందికి పింఛన్లు మంజూరు చేసింది. కానీ అన్ని అర్హతలు ఉన్న తమ కుమార్తె ఉమారాణి పేరు మాత్రం లబ్ధిదారుల జాబితాలో కనిపించకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు.
దరఖాస్తు సమర్పించినప్పటికీ ఆన్‌లైన్‌లో నమోదు చేయడంలో సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వహించడం వల్లే తమ కుమార్తె పింఛన్ కోల్పోయిందని తండ్రి ఆరోపిస్తున్నారు. అధికారుల తప్పిదానికి తమ కుటుంబం ఎందుకు మూల్యం చెల్లించుకోవాలని ప్రశ్నిస్తున్నారు. పింఛన్ వస్తేనే తమ కుమార్తె అవసరాలను కొంతమేర తీర్చుకోగలమని, అలాంటి పరిస్థితుల్లో అధికారుల నిర్లక్ష్యం తమకు తీరని అన్యాయం చేసిందని కన్నీటి పర్యంతమయ్యారు.
అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు
తమకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేసేందుకు ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లిన బాధిత కుటుంబానికి అక్కడ అధికారుల నుంచి సరైన స్పందన లభించలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. న్యాయం కోసం కార్యాలయం ఎదుట బాధితులు బైఠాయించిన సమయంలో సంబంధిత అధికారులు అందుబాటులో లేకపోవడం, కార్యాలయంలో ఖాళీ కుర్చీలు దర్శనమివ్వడం విమర్శలకు తావిచ్చింది.
ఆలస్యంగా కార్యాలయానికి చేరుకున్న ఏపీవీఓ బాధితుల సమస్యపై తగిన విధంగా స్పందించకుండా తన కుర్చీకే పరిమితమయ్యారనే విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ వ్యవహారంపై వివరణ కోరిన విలేకరులకు ఎంపీడీవో పొంతనలేని సమాధానాలు ఇచ్చారనే ఆరోపణలు స్థానికంగా చర్చకు దారితీశాయి.

కలెక్టర్ స్పందించాలి.. బాధితురాలికి న్యాయం చేయాలి!

90 శాతం వైకల్యంతో బాధపడుతున్న ఓ నిరుపేద కుటుంబానికి చెందిన యువతికి పింఛన్ మంజూరు విషయంలో ఎదురైన ఇబ్బందులపై జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు. బాధితురాలు సమర్పించిన దరఖాస్తును పరిశీలించి, ఆన్‌లైన్ నమోదులో ఏమైనా లోపాలు జరిగాయా అనే అంశంపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు.
అధికారుల నిర్లక్ష్యం వల్ల అర్హులైన పేదలు సంక్షేమ పథకాలకు దూరమైతే ఇక న్యాయం ఎక్కడ దొరుకుతుందని బాధిత కుటుంబం ప్రశ్నిస్తోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఉమారాణికి న్యాయం చేయడంతో పాటు బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.