వికారాబాద్ లో ఏవీఎం ఎస్ కేర్ హాస్పిటల్' ప్రారంభం
వికారాబాద్ మేజర్ న్యూస్ :వికారాబాద్ జిల్లా కేంద్రంలోని పాత పోలీస్ స్టేషన్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన ఏ వి ఎం ఎస్ కేర్ హాస్పిటల్ ప్రారంభోత్సవ వేడుక ఎంతో ఘనంగా జరిగింది. ఈ ఆసుపత్రిని తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై రుబ్బెన కట్ చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ... వికారాబాద్ ప్రాంత ప్రజలకు నాణ్యమైన, అత్యాధునిక వైద్య సేవలు స్థానికంగానే అందుబాటులోకి రావడం ఎంతో సంతోషకరమని అన్నారు. అత్యవసర వైద్యం కోసం ప్రజలు హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్లాల్సిన ఇబ్బంది లేకుండా, ఇలాంటి ఆసుపత్రులు ఇక్కడే ఏర్పడటం అభినందనీయమని పేర్కొన్నారు. పేద, మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరల్లో మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి యాజమాన్యానికి ఆయన సూచించారు. అనంతరం ఆసుపత్రిలోని వివిధ విభాగాలు, ఆధునిక వైద్య పరికరాలను స్పీకర్ పరిశీలించి యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ చాపల శ్రీనివాస్ ముదిరాజ్, వైస్ చైర్మన్ మల్లేశం, పీఏసీఎస్ చైర్మన్ బిల్లపాటి రాజశేఖర్ రెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి ఆర్. మహిపాల్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.