మోమిన్‌పేట ఎస్సైపై సీసీఎస్‌లో కేసు నమోదు
వికారాబాద్, మేజర్ న్యూస్: వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఎస్సైగా పనిచేస్తున్న జి. భరత్ భూషణ్‌పై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ వ్యాపారిని బెదిరించి డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నించిన ముఠాకు ఎస్సై సహకరించినట్లు వచ్చిన ఆరోపణలు పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌కు చెందిన ఓ వ్యాపారిని లక్ష్యంగా చేసుకొని కొందరు వ్యక్తులు బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో ఎస్సై భరత్ భూషణ్ సదరు ముఠాకు సహకరించారని, వ్యాపారికి సంబంధించిన వ్యక్తిగత సమాచారం, లొకేషన్ వివరాలు, కదలికలను నిందితులకు చేరవేశారని బాధితుడు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.బాధితుడి ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో ఎస్సైతో పాటు మరికొందరి పేర్లు కూడా ఉన్నట్లు సమాచారం. పోలీసు అధికారిపై కేసు నమోదు కావడం వికారాబాద్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.