స్కేటింగ్‌లో హీనా ఫైజాకు స్వర్ణ, రజత పతకాలు
అనంతపురం బ్యూరో మేజర్ న్యూస్ : స్కేటింగ్ పోటీల్లో లక్ష్మీ సినర్జీ స్కూల్ విద్యార్థినులు అద్భుత ప్రతిభ కనబరిచి పతకాలు సాధించారు. కోచ్ అంజి శిక్షణలో స్కేటింగ్‌లో రాణిస్తున్న విద్యార్థినులు పతకాలతో పాఠశాలకు కీర్తి ప్రతిష్ఠలు తీసుకొచ్చారు.
6 నుంచి 8 సంవత్సరాల వయస్సు విభాగంలో పోటీపడిన హీనా ఫైజా రింక్-1లో రజత పతకం, రింక్-3లో స్వర్ణ పతకం సాధించి తన ప్రతిభను చాటుకుంది. హీనా ఫైజా లక్ష్మీ సినర్జీ స్కూల్‌లో రెండో తరగతి చదువుతోంది.
అదేవిధంగా 4 నుంచి 6 సంవత్సరాల వయస్సు విభాగంలో పాల్గొన్న నైరా రెండు కాంస్య పతకాలు సాధించింది. నైరా లక్ష్మీ సినర్జీ స్కూల్‌లో యూకేజీ చదువుతోంది.
చిన్న వయస్సులోనే స్కేటింగ్‌లో విశేష ప్రతిభ కనబరిచి పతకాలు సాధించిన విద్యార్థినులను పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు అభినందించారు. కోచ్ అంజి అందిస్తున్న శిక్షణ, ప్రోత్సాహంతో విద్యార్థినులు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
రిపోర్టర్ : మొయినుద్దీన్ అనంతపురం బ్యూరో మేజర్ న్యూస్.