ప్రజా సమస్యల పరిష్కారానికి మంత్రి శ్రీధర్‌బాబు హామీ :ఎమ్మెల్యే మల్లారెడ్డి
ప్రజా సమస్యల పరిష్కారానికి మంత్రి శ్రీధర్‌బాబు హామీ
:ఎమ్మెల్యే మల్లారెడ్డి
* ఎమ్మెల్యే మల్లారెడ్డి వినతిపై సానుకూల స్పందన
* క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ఎంఎంసీ కమిషనర్‌కు ఆదేశం
మేడ్చల్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్ (నవంబర్, 13):
నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబును కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా మేడ్చల్ నియోజకవర్గ పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లి, వాటిని త్వరితగతిన పరిష్కరించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.
ఎమ్మెల్యే వినతిపై మంత్రి శ్రీధర్‌బాబు సానుకూలంగా స్పందించారు. వెంటనే మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌కు ఫోన్ చేసి, సంబంధిత సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, పూర్తి వివరాలను తనకు తెలియజేయాలని ఆదేశించారు.
ప్రజా సమస్యలపై మంత్రి తక్షణమే స్పందించడం అభినందనీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సంబంధిత అధికారులు కూడా వెంటనే స్పందించి సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు. ప్రజా సమస్యల పరిష్కారమే తమ ప్రధాన లక్ష్యమని, ప్రజల సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తామని ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి స్పష్టం చేశారు. ప్రజల పక్షాన నిలబడి వారి సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ కృషి చేస్తామని తెలిపారు.