BREAKING
ఆజాద్‌కు రెండు పార్టీల మద్దతు --సర్పంచి పోరులో మారనున్న రాజకీయ సమీకరణాలు! ఆస్తులు సంపాదించుకోవడానికి కొంతమంది టీడీపీలోకి వస్తారు..? ఆస్తులు పోగొట్టుకోవడానికి బొమ్మన శివశంకర్ రెడ్డి.. టీ.బలరాం గౌడ్ మాటల్లో కాదు .. చేతల్లో అభివృద్ధి చేసి చూపిస్తా.. కట్టంగూర్‌లో అభివృద్ధి సమావేశానికి సర్పంచుల గైర్హాజరు! 22 గ్రామ పంచాయతీలకు ఆరుగురే హాజరు.. 72 శాతం మంది దూరం కట్టంగూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరోగ్య లక్ష్యాలకు బ్రేక్ --పీహెచ్‌సీ పనితీరుపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఏదీ? నేటి పంచాంగం 13నవంబర్, 2026 నేటి రాశి ఫలాలు 13 నవంబర్, 2026 వివాహ వేడుకకు రంగం సిద్ధం.. కొత్త జీవితంపై రిమి టోమి కాబోయే భర్త మాథ్యూ ఆసక్తికర పోస్ట్ మీర్జాపూర్ విజయపు ఒత్తిడిని అసలు తీసుకోను.. నటి శ్వేతా త్రిపాఠి ఆసక్తికర వ్యాఖ్యలు క్యాన్సర్ ముప్పును దూరం చేసే అద్భుతమైన ఆరోగ్య అలవాట్లు.. నిపుణులు ఏం చెబుతున్నారు? న్యూజిలాండ్ గడ్డపై భారత ఫుట్‌బాల్ జట్టుకు ఘోర పరాభవం.. తొలి ఫ్రెండ్లీ మ్యాచ్‌లో కివీస్ జయభేరి దర్శకుడిగా మారిన రవి మోహన్.. యోగి బాబు హీరోగా 'ఆన్ ఆర్డినరీ మన్' నుంచి కొత్త సాంగ్ రిలీజ్ దిగ్గజ నటుడు పద్మశ్రీ మధుకు అరుదైన గౌరవం.. ప్రథమ బిచ్చు తిరుమల పురస్కారం ప్రకటన భోజనం చేస్తూ స్మార్ట్‌ఫోన్ వాడే అలవాటు ఉందా.. అయితే ఈ తీవ్రమైన అనారోగ్య సమస్యలు తప్పవు 'పరిషత్' పీఠాలపై పరోక్ష పోరు! అభాగ్యులకు అండగా సేవా సంస్థలు!

కట్టంగూర్‌లో అభివృద్ధి సమావేశానికి సర్పంచుల గైర్హాజరు! 22 గ్రామ పంచాయతీలకు ఆరుగురే హాజరు.. 72 శాతం మంది దూరం

Select Suryaa Now
కట్టంగూర్‌లో అభివృద్ధి సమావేశానికి సర్పంచుల గైర్హాజరు!  22 గ్రామ పంచాయతీలకు ఆరుగురే హాజరు.. 72 శాతం మంది దూరం

 

 నల్గొండ జిల్లా కట్టంగూరు మండల గ్రామ పంచాయతీల అభివృద్ధి, ప్రజాప్రతినిధుల సామర్థ్య వృద్ధి, ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కట్టంగూర్ మండల పరిషత్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమావేశానికి సర్పంచుల హాజరు నిరాశాజనకంగా ఉంది. మండలంలోని మొత్తం 22 గ్రామ పంచాయతీలకు గాను కేవలం ఆరుగురు సర్పంచులు మాత్రమే హాజరయ్యారు. అంటే 27. శాతం మంది మాత్రమే సమావేశానికి హాజరుకాగా, మిగతా 16 మంది సర్పంచులు  గైర్హాజరయ్యారు.

జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఆదేశాల మేరకు ప్రతి 45 రోజులకు ఒకసారి సర్పంచులు, మండల స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించాల్సి ఉంది. ఇందులో భాగంగా మండల ప్రత్యేక అధికారి జి.సతీష్ కుమార్ ఆధ్వర్యంలో, ఎంపీడీవో జి.అంజన్ రెడ్డి సమక్షంలో సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా నకిరేకల్ మార్కెట్ కమిటీ చైర్మన్ గుత్త మంజుల మాధవరెడ్డి పాల్గొన్నారు.

సమావేశంలో ఎల్‌నినో ప్రభావాన్ని అధిగమించేందుకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలు, నీటి సంరక్షణపై చర్చించి నీటి ప్రతిజ్ఞ నిర్వహించారు. వివిధ శాఖల ద్వారా గ్రామ పంచాయతీల్లో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు.

 

22 గ్రామ పంచాయతీల అభివృద్ధికి సంబంధించిన కీలక సమావేశానికి ఆరుగురు సర్పంచులు మాత్రమే హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది.  దూరంగా ఉండటానికి కారణాలేమిటి? 

గ్రామాల్లో నీటి సమస్యలు, పారిశుద్ధ్యం, అభివృద్ధి పనులు, ప్రభుత్వ పథకాల అమలుపై చర్చించాల్సిన సమావేశాలకు ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం ఎంతో అవసరం. భవిష్యత్తులో నిర్వహించే సమావేశాలకు అన్ని గ్రామాల సర్పంచులు హాజరయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.