ఆస్తులు సంపాదించుకోవడానికి కొంతమంది టీడీపీలోకి వస్తారు..? ఆస్తులు పోగొట్టుకోవడానికి బొమ్మన శివశంకర్ రెడ్డి.. టీ.బలరాం గౌడ్ మాటల్లో కాదు .. చేతల్లో అభివృద్ధి చేసి చూపిస్తా..
వెల్దుర్తి, వెల్దుర్తిరూరల్, మేజర్ న్యూస్: వెల్దుర్తి అభివృద్ధిని మాటల్లో కాకుండా, చేతల్లో అభివృద్ధి చేసి చూపిస్తానని గ్రామ సర్పంచ్ అభ్యర్థి బొమ్మన రమాకాంత్ రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రమైన వెల్దుర్తి పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సభ అధ్యక్షులు రామచంద్రనాయుడు పాత్రికేయులతో మాట్లాడుతూ పత్తికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే కేఈ. శ్యాంకుమార్ ఆదేశాల మేరకు వెల్దుర్తి మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా బొమ్మన రమాకాంత్ రెడ్డిని టీడీపీ నాయకులు, కార్యకర్తలు ప్రతిపాదించడం జరిగిందన్నారు. వెల్దుర్తి మండల మాజీ టీడీపీ అధ్యక్షులు టీ.బలరాంగౌడ్ మాట్లాడుతూ గ్రామ ప్రజలకు, టీడీపీ నాయకులకు ఆయన సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేశారు. కొంతమంది జంపింగ్ జపాంగులు అక్కడ, ఇక్కడ పనులు చేయించుకుంటున్నారని, గతంలో టీడీపీ పార్టీ ఆవిర్భవించినప్పటి నుండి బి.శివశంకర్ రెడ్డి టీడీపీలోనే ఉన్నారన్నారు. అప్పటి నుండి ఇప్పటివరకు బి.శివశంకర్ రెడ్డి ఏ పదవీ ఆశించలేదని, ఇంచార్జీలు మారారు, ఎమ్మెల్యేలు మారారు, మేము 2009 నుండి కేఈ కుటుంబం వెంటే ఉన్నామన్నారు. నన్ను సొంత తమ్ముడి లాగానే వెంట తీసుకువెళ్లేవారని, నేను ఆయన దగ్గరకు రాకముందు, నాకు దేవుడు లేదని, దైవము లేదని, పొద్దుపొడిచేలోపు వాడిని కొడదామా, వీడిని కొడదామా, వాడిని తందామా, కేసులు, కోర్టులు, వాయిదాలు ఉండేవారన్నారు. అవి కూడా ఒక వ్యక్తి నుంచి జరిగినవేనని, ఇప్పుడు నా మీద ఎటువంటి కేసులు లేవన్నారు. టీడీపీలో సీనియర్స్ ఎవ్వరు, పార్టీ పుట్టినప్పటి నుండి సీనియర్లు మేమే, మమ్ముల్ని కాదని వేరొక వ్యక్తికి మద్దతు ఇవ్వడం జరిగింది. ఆ రోజుల్లో మేము ఆర్థికంగా నష్టపోయాం, ఆస్తులు అమ్ముకున్నాం, కొంతమంది అనివార్య కారణాల వల్ల టీడీపీలోకి వచ్చారు. 2019 నుండి 2024 వరకు కొంతమంది వ్యక్తులు దూరమయ్యారని, మా చేతకాదని చేతులెత్తేశారన్నారు. ఈ వ్యక్తులు అధికారం ఉన్నప్పుడు మాకు కావాలంటారు, అధికారం లేకుంటే టీడీపీలో నుంచి వెళ్లిపోతారు, అధికారం వస్తే ఆస్తులు సంపాదించుకోవడానికి వస్తారన్నారు. ఆస్తులు పోగొట్టుకోవడానికి బొమ్మన శివశంకర్ రెడ్డి ఉన్నారా, వెల్దుర్తి గ్రామ ప్రజలు గమనించాలని కోరారు. సర్పంచ్ అభ్యర్థి బొమ్మన రమాకాంత్ రెడ్డి మాట్లాడుతూ హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ మరియు గ్రామపెద్దలకు, ప్రజలకు, ఇక్కడికి వచ్చిన టీడీపీ నాయకులందరికీ మన ఎమ్మెల్యే కేఈ. శ్యాంకుమార్ ఆశీస్సులతో, జిల్లా టీడీపీ నాయకులు సుబ్బరాయుడు ఆదేశాల మేరకు గ్రామ ప్రజల సహకారంతో వెల్దుర్తి గ్రామ సర్పంచ్ (ఓసి) అన్ రిజర్వుడు కావడంతో నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుందన్నారు. నా తండ్రి ఎన్నో సంవత్సరాల నుండి రాజకీయం చేస్తూ వచ్చారని, ఎంతోమంది పదవులు అనుభవించారని, ఎమ్మెల్యేలు, మంత్రులు అయ్యారని, వెల్దుర్తి ప్రజల కోసం ఆయన అహర్నిశలు కష్టపడ్డారన్నారు. ఎమ్మెల్యే కేఈ. శ్యాంకుమార్ సహకారంతోనే నేను ముందుకు వెళ్తానన్నారు. వెల్దుర్తి గ్రామ సర్పంచ్‌గా నన్ను ఓట్లు వేసి గెలిపించాలని ఓటర్ మహాశయులను కోరారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు బొమ్మన రాజశేఖరరెడ్డి, ఎంపీటీసీలు శివకుమార్, ఎం.రాంబాబు, ఎం.బజారు, చిన్నగోపాల్ గౌడ్, మెకానిక్ నారాయణగౌడ్, రాఘవేంద్రగౌడ్, ఉస్మాన్, ఐ టీడీపీ సూరి, రాజా రమేష్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.