నాగంపేట్‌లో ఉచిత వైద్య శిబిరం
సూర్య బాల్కొండ /ముప్కాల్ : ముప్కాల్ మండలంలోని నాగంపేట్ గ్రామంలో ఏజీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో డాక్టర్ అపర్ణ గైని ఆధ్వర్యంలో నరాల వైద్య నిపుణులు, జనరల్ ఫిజీషియన్లు గ్రామ ప్రజలకు వైద్య సేవలు అందించారు.వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న గ్రామ ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను పంపిణీ చేశారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందించాలనే ఉద్దేశంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దాసరి గంగాధర్, గ్రామ పంచాయతీ కార్యదర్శి మంచిర్యాల కవిత, వైద్య సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.