ప్రజాస్వామ్య పరిరక్షణే లక్ష్యంః మంత్రి వాకిటి శ్రీహరి
సూర్య, తెలంగాణ బ్యూరో ప్రతినిధిః ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో నిర్వహించిన ‘ఓట్ బచావో – దేశ్ బచావో’ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓటు హక్కు ప్రాధాన్యత, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత వంటి కీలక అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి కార్యక్రమంలో పాల్గొని ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను చాటిచెప్పారు. ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి పునాది అని, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, ప్రతి ఓటు విలువను కాపాడటం అత్యంత ముఖ్యమనే సందేశాన్ని ఈ కార్యక్రమం ద్వారా వెల్లడించారు.
ఎ.రవీందర్, హైదరాబాద్.