BREAKING
డ్రోన్లు, సీసీ కెమెరాలతో నిరంతర నిఘా.. ప్రశాంతంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు ప్రతి ఇంటా వెలుగులు నిండాలి టెక్కలిలో పసుపు జెండా రెపరెపలు గెలుపొందిన ఎస్.రాయవరం టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి రమణమ్మ! జడ్పిటిసి గా కోట నీలవేణి విజయం టెక్కలి నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వానికి ఘన విజయం గరివిడి జడ్పిటీసి గా బొత్స పూజిత విజయం జిల్లాలో మొట్టమొదటి సారిగా వికసించిన కమలం " మెలియాపుట్టిలో టీడీపీ విజయదుందుభి ఒకే ఇంట్లో రెండు జెండాలు.. సైకిల్ స్పీడ్ కు బ్రేకు వెయ్యలేకపోయిన వైసిపి కడుపునొప్పి తాళలేక వివాహిత ఆత్మహత్య ఎంపీటీసీ ఎన్నికల్లో కూటమిదే పై చేయి అనందపురం మండలంలో టీడీపీ జయకేతనం పద్మనాభంలో కూటమి హవా..!!

ప్రభుత్వ లక్ష్యాల సాధనలో జిల్లాల పనితీరు మెరుగుపడాలి

Select Suryaa Now
ప్రభుత్వ లక్ష్యాల సాధనలో జిల్లాల పనితీరు మెరుగుపడాలి

 

సూర్య - పెద్దపల్లి: ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల లక్ష్యాల సాధనలో జిల్లాల పనితీరు మెరుగుపడాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సూచించారు. శుక్రవారం రాష్ట్రంలోని కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో విద్య, ఉపాధి హామీ, తాగునీటి సరఫరా, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం తదితర అంశాలపై సమీక్షించారు. పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్లు బి. శ్రీరాములు, జె. అరుణశ్రీ పాల్గొన్నారు.
సమగ్ర శిక్ష, పీఎం శ్రీ పథకాల నిధుల వినియోగాన్ని జనవరి మొదటి వారంలోగా గరిష్ట స్థాయికి చేర్చాలని, పాఠశాలల్లో మౌలిక వసతులు, విద్యా ప్రమాణాలు మెరుగుపరచాలని సీఎస్ ఆదేశించారు. VBGRAMG ద్వారా మార్చి నెలాఖరులోగా 12 కోట్ల పనిదినాల లక్ష్యాన్ని సాధించాలని సూచించారు. వేసవి ముగిసే వరకు తాగునీటి సరఫరాకు ప్రాధాన్యతనిస్తూ నవంబర్ 15లోగా బోర్లు, చేతిపంపుల మరమ్మతులు పూర్తి చేయాలన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయడంతో పాటు లబ్ధిదారులకు ఉచిత ఇసుక, రూ.230కే సిమెంట్ బస్తా అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులో జిల్లాల పనితీరు మెరుగుపరచాలని స్పష్టం చేశారు.