BREAKING
వాల్ స్ట్రీట్ టెక్ బుల్స్ మళ్లీ రంగంలోకి: 3 శాతానికి పైగా దూసుకెళ్లిన నాస్‌డాక్ ఫ్యూచర్స్ .. ఈ భారీ ర్యాలీకి 3 ప్రధాన కారణాలివే! నిత్యం అందుబాటులో ఉండి సేవ చేస్తా -ప్రమాణస్వీకారంలో 65వ డివిజన్ కార్పొరేటర్ కోటకొండ రేవతి గర్భిణీలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త.. ఏఐ స్టాక్స్‌లో మళ్లీ బుల్ ర్యాలీ..ఏఐ ట్రేడ్: కోర్‌వీవ్ 31%, మైక్రాన్ 17%, ఇంటెల్ 15% జంప్.. త్రాగునీటి సమస్య పరిష్కారమే నా లక్ష్యం -ప్రమాణస్వీకారంలో 62వ డివిజన్ కార్పొరేటర్ బండారు పార్థసారధి వాల్ స్ట్రీట్‌లో చారిత్రాత్మక 'మాన్‌స్టర్ ర్యాలీ'..నాస్‌డాక్ 7.5%, డౌ జోన్స్ 1,500 పాయింట్ల జంప్.. చీపురుపల్లి మరింత అభివృద్ధికి సహకరిస్త : బొత్స 48 వ డివిజన్ కార్పొరేటర్ గా ఆర్. పీ శ్రీనివాసులు ప్రమాణ స్వీకారం ఒక్క అవకాశం ఇవ్వండి గ్రామాభివృద్ధికి బాటలు వేస్తా పంచాయతీ ఎన్నికల్లో జనసైనికులకు పూర్తి స్వేచ్ఛ మలయనూరులో టిడిపి ప్రచార రథం పై దాడి. ధ్వంసమైన బొలెరో వాహనం. సమన్వయంతో పనిచేస్తే గెలుపు: కిమిడి కళా వెంకట రావు సర్పంచ్ ఎన్నికలకు వేగంగా ఏర్పాట్లు..సామగ్రిని సిద్ధం చేస్తున్న సిబ్బంది మున్సిపల్ వైస్ చైర్మన్ గా పప్పల మోహన్ కొలువు దీరిన పాలకొండ నగర పంచాయతీ పాలకవర్గం

పండుగ సాయన్న జయంతి వేడుకలను అధికారికంగా ఘనంగా నిర్వహించాలి:

Select Suryaa Now
పండుగ సాయన్న జయంతి వేడుకలను అధికారికంగా ఘనంగా నిర్వహించాలి:

సంగారెడ్డి ; తెలంగాణ వీరయోధుడు, ప్రజల పక్షాన నిలిచిన పోరాట యోధుడు పండుగ సాయన్న జయంతి వేడుకలను సంగారెడ్డి జిల్లాలో అధికారికంగా, అత్యంత ఘనంగా నిర్వహించాలని ముదిరాజ్ సంఘం రాష్ట్ర నాయకులు, సంగారెడ్డి ఎమ్మెల్యే కాంటెస్టెడ్ అభ్యర్థి పులిమామిడి రాజు జిల్లా అధికారులను కోరారు. ఈ మేరకు సంగారెడ్డి కలెక్టరేట్‌లో  బిసి వెల్ఫేర్ అధికారి జగదీష్ కి వినతిపత్రం పులిమామిడి రాజు ఆధ్వర్యంలో సమర్పించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అక్టోబర్ 22న నిర్వహించనున్న పండుగ సాయన్న జయంతి ఉత్సవాలను జిల్లా యంత్రాంగం పూర్తి ప్రోటోకాల్‌తో నిర్వహించాలని పులిమామిడి రాజు విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో 'రాబిన్‌హుడ్‌'గా పేరుగాంచిన పండుగ సాయన్న పోరాట స్ఫూర్తిని, త్యాగాలను భావితరాలకు తెలియజేసేలా జయంతి వేడుకలను నిర్వహించాలని సూచించారు.
పండుగ సాయన్న జయంతి, వర్ధంతి వేడుకలను ప్రతి సంవత్సరం అధికారికంగా నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 1217 జారీ చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. సంగారెడ్డి జిల్లాలో కూడా వేడుకలను విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని కోరారు.అదేవిధంగా, ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు నీలం మధుకు ఎమ్మెల్సీ పదవి కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరినట్లు పులిమామిడి రాజు తెలిపారు. ముదిరాజ్ సామాజిక వర్గానికి రాజకీయ ప్రాధాన్యత కల్పించి, తగిన గుర్తింపు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇట్టి కార్యక్రమంలో జిల్లా నాయకులు మరియు తెర్పొల్ సర్పంచ్ సతీష్ ముదిరాజ్ మరియు ముదిరాజ్ సంఘం పట్టణ అధ్యక్షులు జనార్ధన్, ఈశ్వర్, బొట్టు వెంకన్న, గుణాకర్, శ్రీనివాస్, తిర్మల్, రామ క్రిష్ణ, సాయి కిరణ్, ఆనంద్, గవ్వల కేశవ్, సుధాకర్, రాజేష్, బస్వరాజ్, మండల నాయకులు యువ నాయకులు, వివిధ గ్రామాలకు చెందిన ముదిరాజ్ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.