పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ అండ : షేక్ చాంద్ పాషా
కొండాపూర్,మేజర్ న్యూస్ : శేరిలింగంపల్లి నియోజకవర్గం కొండాపూర్ డివిజన్‌కు చెందిన నిరోషా కాశీనాథ్‌కు వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ (CMRF) ద్వారా రూ.1,72,000 ఆర్థిక సాయం మంజూరైంది. ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ సహకారంతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు షేక్ చాంద్ పాషా ప్రత్యేక చొరవ తీసుకుని ఈ సాయం మంజూరయ్యేలా కృషి చేశారు. ఆపదలో ఉన్న పేదలకు అండగా నిలవడమే లక్ష్యంగా ప్రజాసేవ కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు.