BREAKING
7వ వార్డులో టీడీపీ అభ్యర్థి రెడ్డమ్మ ఇంటింటి ప్రచారం అద్దంకిలో మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పర్యటన కిల్లర్ మూవీ రివ్యూ: సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా వచ్చిన పూర్వజ్ సినిమా ఎలా ఉందంటే? మోడల్ స్కూల్‌ల సమస్యలు పరిష్కరించాలని ఉపాధ్యాయుల నిరసన ఇండిపెండెంట్ చైర్మన్ అభ్యర్థి నజీర్ అహ్మద్ విస్తృత ప్రచారం పసపుమాయమైన మలయానుర్, ఎమ్మెల్యే ప్రచారానికి భారీ స్పందన. చివరి రోజు హోరెత్తిన వైసిపి ప్రచారం అద్దంకి మున్సిపాలిటీలో పోలింగ్ కేంద్రాలు పరిశీలించిన జిల్లా కలెక్టర్. భారీ ర్యా లీ నిర్వహించనున్న ఎమ్మెల్యే సౌర శక్తి వైపు అడుగులు.. కాలుష్య రహిత భవిష్యత్తుకు వెలుగులు ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లీష్‌పై ప్రత్యేక శిక్షణ తరగతులు ---ప్రముఖ స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షకులు, కార్పొరేట్ ట్రైనర్ డా. కె.వి. నారాయణ్ 36వ డివిజన్‌లో మల్లేశ్వరి తరఫున మాజీ మేయర్ మదమంచి స్వరూప ప్రచారం.. అరవింద్ నగర్ మసీదు సమీపంలో మైనార్టీ ఓటర్లను కలిసి మద్దతు కోరిన మాజీ మేయర్.. పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటు హక్కును నమోదు చేసుకోవాలి మహిళా సమాఖ్య భవనానికి భూమి పూజ నూతన కోర్టులో ఏపీపీ ఛాంబర్ ప్రారంభం

నూతన కోర్టులో ఏపీపీ ఛాంబర్ ప్రారంభం

Select Suryaa Now
నూతన కోర్టులో ఏపీపీ ఛాంబర్ ప్రారంభం

సూర్య, భీమ్‌గల్:
భీమ్‌గల్ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన న్యాయస్థానంలో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ) ఛాంబర్‌ను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నూతన కోర్టులో నేటి నుంచి కేసులకు సంబంధించి సాక్ష్యాల నమోదు ప్రక్రియ (ఎవిడెన్స్ ప్రొసీడింగ్స్) ప్రారంభమైంది.నూతన కోర్టులో సాక్ష్యాల నమోదు ప్రక్రియ ప్రారంభం కావడంతో భీంగల్ ప్రాంత ప్రజలు, న్యాయవాదులు, కక్షిదారులకు మరింత సౌకర్యం కలగనుంది. స్థానికంగానే న్యాయపరమైన సేవలు అందుబాటులోకి రావడంతో సమయం, ప్రయాణ ఖర్చులు ఆదా కానున్నాయి. అలాగే న్యాయపరమైన కార్యకలాపాలు మరింత వేగవంతం కానున్నాయని పేర్కొన్నారు.నూతన కోర్టులో ఏపీపీ ఛాంబర్ ప్రారంభం, సాక్ష్యాల నమోదు ప్రక్రియ ప్రారంభం కావడం న్యాయస్థాన అభివృద్ధిలో మరో కీలక ముందడుగుగా నిలిచింది.ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రామకృష్ణ, భీమ్‌గల్ ఎస్సై తిరుపతి,మోర్తాడ్ ఎస్సై రాము, న్యాయవాదులు, గజ్జెల చైతన్య,సుర సురేష్,ఆవరీ రమేష్, పొడేటి శంకర్,కోర్టు కానిస్టేబుల్ రమణ భీమ్‌గల్, రాజు (కమ్మర్‌పల్లి), అనిల్ (సిరికొండ), హరి (మోర్తాడ్), ఎర్గట్ల సురేష్,తదితరులు పాల్గొన్నారు.