BREAKING
ఎంజీఆర్ బయోపిక్‌లో జయలలితగా నటి త్రిష.. వెండితెరపై మరోసారి ‘పురట్చి తలైవి’ పాత్రలో సంచలనం? హెబ్రాన్‌లో ఇజ్రాయెల్ ఆంక్షలు.. 10 మార్గాలు మూసివేత, 5 వేల మంది నిరాశ్రయులు కాళేశ్వరం వైఫల్యానికి బీఆర్ఎస్ తప్పిదాలే కారణంః మాజీ ఎమ్మెల్యే ఇరవత్రి అనిల్ డోన్‌లో రూ.1.47 లక్షల నగదు సీజ్: 16 మంది వైకాపా నాయకుల అరెస్ట్ మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు.. డ్రోన్ దాడి ఆరోపణలు, హోర్ముజ్‌లో ట్యాంకర్‌పై పేలుడు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి. ---జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పట్టపగలే డ్రంకెన్ డ్రైవ్.. ఐదుగురు పట్టివేత పెద్దపంజాణి యుటిఎఫ్ నూతన కార్యవర్గం బోయినపల్లి గురుకుల విద్యార్థుల చిత్రకళకు జిల్లా పాలనాధికారి ప్రశంసలు పొగాకు వినియోగానికి దూరంగా ఉండండి నాలుగో వార్డును అభివృద్ధి పథంలో నడిపిస్తా! భూ సమస్యలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యంజిల్లా కలెక్టర్ కె. హైమావతి త్రాగునీరు వృధా చేయవద్దు జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మెదక్ ఆర్‌డీఓ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం స్వర్ణ వైద్యశాలను సందర్శించిన బాపట్ల జిల్లా మలేరియా అధికారి నాగార్జున రావు

మోడల్ స్కూల్‌ల సమస్యలు పరిష్కరించాలని ఉపాధ్యాయుల నిరసన

Select Suryaa Now
మోడల్ స్కూల్‌ల సమస్యలు పరిష్కరించాలని ఉపాధ్యాయుల నిరసన

చేవెళ్ల : తెలంగాణ ఆదర్శ పాఠశాలల జేఏసీ (JAC) పిలుపు మేరకు చేవెళ్ల మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు శుక్రవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. నిరసనలో భాగంగా మొదటి రోజు మధ్యాహ్న భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి తమ నిరసనను వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ, మోడల్ స్కూల్‌లలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

ప్రధాన డిమాండ్లు ఇవే..

  • మోడల్ స్కూల్‌లను విద్యాశాఖలో విలీనం చేయాలి.
  • 010 పద్దు ద్వారా వేతనాలు చెల్లించాలి.
  • పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలను వెంటనే విడుదల చేయాలి.
  • నూతన హెచ్‌బీటీల (HBTs) వేతనాన్ని రూ.35,000కు పెంచాలి.
  • వృత్తి విద్యా (Vocational) ఉపాధ్యాయుల పెండింగ్ వేతన బకాయిలను విడుదల చేయాలి.
  • ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న ఇతర సమస్యలను పరిష్కరించాలి.

ఈ సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని ఉపాధ్యాయులు కోరారు.

ఈ నిరసన కార్యక్రమంలో జేఏసీ సభ్యులు కె. బాబు, మహేశ్వరరావు, వినోద్ కుమార్, అరవింద్, అంజిలప్ప, స్వప్న, హూరున్నీసా, హూర్ జహన్ బేగం, సల్మా బేగం, శ్రీనివాస్ రెడ్డి, శివకుమార్, షహన బేగం తదితరులు పాల్గొన్నారు.