ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి. ---జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్
నర్సాపూర్ ; నర్సాపూర్ ఏరియా ఆసుపత్రినీ డి సి హెచ్ శివ దయాలతో జిల్లా కలెక్టర్ శుక్రవారం సందర్శించారు.
ఆస్పత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించి రోగులకు అందుతున్న వైద్య సేవలు, వైద్యులు, సిబ్బంది అందుబాటు, విధుల హాజరుపై ఆరా తీశారు.సిబ్బంది హాజరు వివరాలను పరిశీలించారు.విధులకు సమయపాలనతో హాజరై రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. రోగుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రణాళికలు రూపొందించి అందుకు అనుగుణంగా రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సేవలు నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టి పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఏరియా
ఆసుపత్రి సూపరిండెంట్ వంశి,
డాక్టర్లు మీర్జా , గైనకాలజిస్ట్. ప్రేమ వర్ధిని,డాక్టర్ దుర్గా అనస్థీటిస్ట్ సివిల్ సర్జన్ రాము, వసుధ, వీణా
ప్రియదర్శిని అన్ని నర్సింగ్ అధికారులు ల్యాబ్ టెక్నీషియన్లు సిబ్బంది పాల్గొన్నారు.