BREAKING
ఫోక్స్ అవగాహన కార్యక్రమం ఎల్ వి ప్రసాద్ లో డయాబెటిక్ రెటినోపతి పై అవగాహన ఇందిరమ్మ గృహాలకు భూమి పూజ చేసిన మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ 31 నుండి గీతంలో సౌత్ జోన్ ఇంటర్-యూనివర్సిటీ పురుషుల టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్ పోటీలు వ్యవసాయ పరిశోధనలకు భారత్ లో ప్రతిష్టాత్మక ఐకార్-సీజీఐఏఆర్ సైన్స్ అండ్ పార్టనర్‌షిప్ వీక్‌ నిర్వహణ! ఆస్కార్ అర్హత సాధించిన 'వి వర్ హియర్' షార్ట్ ఫిల్మ్‌తో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా జతకట్టిన ప్రియాంక చోప్రా! ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కల సాకారం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం - జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసు అధికారులు గ్రామాల్లో విస్తృత పర్యటన పిల్లలను కట్టిపడేస్తున్న యానిమేటెడ్ బ్యాక్‌గ్రౌండ్స్ సీతారామ భద్ర క్షేత్ర నిర్మాణానికి విరాళాల వెల్లువ చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి,సీనియర్ సివిల్ జడ్జి గోపిక నాగ శ్రావ్య తప్పిపోయిన ప్రైవేట్ హెలికాప్టర్.. రంగంలోకి దిగిన సైన్యం, ఎస్డీఆర్‌ఎఫ్ రెస్క్యూ బృందాలు! పేలవంగా సాగిన మండల సర్వసభ్య సమావేశం! బనస్కాంతలో రూ.14 వేల కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభం భారత్‌పై భారీ విజయంతో సిరీస్‌లో ఖాతా తెరిచిన కివీస్!

ఢిల్లీ సభకు మక్తల్ నుంచి కాంగ్రెస్ శ్రేణుల తరలింపు కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతూ బస్సులో ప్రయాణించిన మంత్రి వాకిటి శ్రీహరి

Select Suryaa Now
  ఢిల్లీ సభకు మక్తల్ నుంచి కాంగ్రెస్ శ్రేణుల తరలింపు కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతూ బస్సులో ప్రయాణించిన మంత్రి వాకిటి శ్రీహరి

 


తెలంగాణ బ్యూరో ప్రతినిధిః ఓట్ బచావో – దేశ్ బచావో కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ నవంబర్ 1న ఢిల్లీలో నిర్వహించనున్న భారీ నిరసన సభకు మంత్రి వాకిటి శ్రీహరి ఇచ్చిన పిలుపు మేరకు మక్తల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో బయలుదేరారు. మక్తల్ నుంచి ఢిల్లీకి వెళ్లేందుకు ఏర్పాటు చేసిన బస్సులను  మంత్రి  జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి స్వయంగా కార్యకర్తలతో కలిసి బస్సులో ప్రయాణిస్తూ నినాదాలు చేశారు. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతూ వారిలో జోష్ పెంచారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు సంరక్షణ లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి పునాది అని, ప్రతి పౌరుడి ఓటు హక్కును కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు.
ఢిల్లీ నిరసన సభను విజయవంతం చేసేందుకు మక్తల్ నియోజకవర్గం నుంచి నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా తరలివెళ్లారు.
ఎ.రవీందర్‌ సూర్య తెలంగాణ బ్యూరో ప్రతినిధి