BREAKING
మున్సిపల్ ఎన్నికల కు పటిష్ట పోలీసు బందోబస్తు.... గ్లోబల్ మార్కెట్లలో వణికిపోతున్న టెక్ షేర్లు పోతేపల్లిలో పౌర హక్కుల దినోత్సవం డిజిటల్ వేదికపైకి పంకజ్ త్రిపాఠి, అదితి రావు హైదరి 'కొత్త' వినోదం.. నవంబర్ 13న సోనీ లివ్‌లో 'పారివారీక్ మనురంజన్' స్ట్రీమింగ్! రైతులను అన్ని విధాల ఆదుకుంటాం కట్టా ఆదిశేషయ్య కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి. రెడ్ డిట్, పింటరెస్ట్ షేర్లకు భారీ షాక్..! ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి రోజువారీ లక్ష్యాలను నిర్దేశించుకుని రీ సర్వే పూర్తి చేయాలి - జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అద్భుత ప్రతిభ మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఏ ఎస్ ఎన్ రెడ్డి సేవలు అభినందనీయం విబిజి రామ్ జీ పనులు సమర్థవంతంగా చేపట్టాలి - జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా హార్ముజ్ జలసంధిలో రెండు చమురు ట్యాంకర్లను నిలిపివేసిన ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్! నగరపంచాయతీలో ప్రశాంత ఎన్నికల నిర్వహణకు సహకరించాలి కొణతాలపాలెంలో వరదలకు కూలిన పూరిళ్ళు *భాధిత కుటుంబానికి రూ.5 వేలు ఆర్థిక సాయం *

ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ గడువు పొడిగింపు!

Select Suryaa Now
ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ గడువు పొడిగింపు!

 

ప్రొద్దుటూరు అర్బన్ మేజర్ న్యూస్:ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియకు సంబంధించిన గడువును కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి పొడిగించింది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం విడుదల చేసిన తాజా షెడ్యూల్ ప్రకారం ఓటరు జాబితాలో అభ్యంతరాలు, నోటీసులు, దరఖాస్తుల పరిశీలన, పరిష్కారానికి విధించిన గడువును అక్టోబర్ 22 నుంచి నవంబర్ 20, 2026 వరకు పొడిగించారు. అదేవిధంగా ఈ నెల 30న విడుదల కావాల్సిన తుది ఓటరు జాబితా ప్రచురణ తేదీని కూడా వాయిదా వేశారు. సవరించిన షెడ్యూల్ ప్రకారం నవంబర్ 30, 2026న తుది ఓటరు జాబితాను అధికారికంగా ప్రకటించనున్నారు. అర్హులైన ఏ ఒక్క ఓటరు కూడా జాబితాలో చోటు కోల్పోకూడదనే ఉద్దేశంతో గడువు పొడిగింపు నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఓటరు నమోదుతో పాటు ఓటరు జాబితాలో పేర్ల సవరణలు, చిరునామా మార్పులు, ఇతర అభ్యంతరాలు ఉన్నవారు నవంబర్ 20వ తేదీలోపు తమ ప్రాంత బూత్ స్థాయి అధికారి లేదా ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి ని సంప్రదించి సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలు, ఆన్‌లైన్ ఓటరు సేవల కోసం భారత ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చని తెలిపారు.
ఈ మేరకు 132-ప్రొద్దుటూరు అసెంబ్లీ నియోజకవర్గ ఓటరు నమోదు అధికారి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వి. వెంకటపతి శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో వివరించారు.

రిపోర్టర్: ప్రతాప్, ప్రొద్దుటూరు అర్బన్, కడప జిల్లా