పట్టపగలే డ్రంకెన్ డ్రైవ్.. ఐదుగురు పట్టివేత
జీహెచ్‌ఎంసీ జీహెచ్‌ఎంసీ పరిధిలోని శంషాబాద్ రాళ్లగూడ రోడ్డులో ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న ఐదుగురు పట్టుబడ్డారు. మధ్యాహ్నం వేళల్లోనే పోలీసులు తనిఖీలు చేపట్టడంతో వాహనదారుల్లో అప్రమత్తత కనిపించింది. తనిఖీల సమాచారం తెలుసుకున్న కొందరు వాహనదారులు ప్రధాన రహదారులను వదిలి లోపలి మార్గాల వైపు వెళ్లినట్లు తెలిసింది. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని పోలీసులు సూచించారు. రాత్రి వేళలకే పరిమితం కాకుండా పగటిపూట కూడా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు కొనసాగుతాయని హెచ్చరించారు.
పోతుల నర్సింహా, మేజర్ న్యూస్ శంషాబాద్.