BREAKING
దుత్తలూరులో టీడీపీ అభ్యర్థులకు మద్దతుగా ఇంటింటి ప్రచారం అభివృద్ధిని చూసి ఆశీర్వదించండి దేశ ప్రధాని పాల్గొననున్న డీజీపీలు, ఐజీపీల కాన్ఫరెన్స్ నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలి.........జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ భార్య గౌరీ స్ప్ర్యాట్‌తో మొదటి కర్వా చౌత్ జరుపుకున్న అమీర్ ఖాన్.. అనిల్ కపూర్ ఇంట్లో తారల సందడి! ఇచ్చిన హామీలన్నిటిని అమలు చేస్తున్నాం జేసన్ స‌ంజయ్ పేరుతో ఫేక్ అకౌంట్లు.. అభిమానులకు కీలక హెచ్చరిక పూ ఐకానిక్ లుక్‌ను రీక్రియేట్ చేసిన ఓర్రీ.. ఆలియా భట్ నవ్వుల వర్షం, కరీనా కపూర్ ఫిదా! రైతుల సమస్యలను పరిష్కరించాలి – బీజేపీ నాయకుల డిమాండ్ ప్రారంభోత్సవం ఆర్భాటం... కొనుగోళ్లలో మాత్రం శూన్యం! --నెల రోజులైనా పెసల కొనుగోళ్లు ప్రారంభించని అధికారులు.. --మార్క్‌ఫెడ్ కేంద్రం చుట్టూ రైతుల ప్రదక్షిణలు.. --ఉన్నతాధికారులు స్పందించాలని అన్నదాతల డిమాండ్ శూర్పణఖ అత్యంత తప్పుగా అర్థం చేసుకున్న పాత్ర.. రామాయణంపై వినూత్న వ్యాఖ్యలు చేసిన రకుల్ ప్రీత్ సింగ్! కేరళ SIRపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. గడువు పొడిగింపునకు నో, ఓటర్ల ఫిర్యాదులపై ECI విచారణ నో ఆక్షన్ ప్రాజెక్ట్‌తో ఓటీటీ ఎంట్రీ ఇవ్వడానికి భయపడిన సన్నీ డియోల్.. 'ఇక్కా' వెనుక ఆసక్తికర విషయాలు వెల్లడించిన నెట్‌ఫ్లిక్స్! ఢిల్లీ సభకు మక్తల్ నుంచి కాంగ్రెస్ శ్రేణుల తరలింపు కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతూ బస్సులో ప్రయాణించిన మంత్రి వాకిటి శ్రీహరి బాక్సాఫీస్ వద్ద 'ఉడ్తా తీర్' హవా.. తొలి వారంలో రూ.30 కోట్ల క్లబ్‌లో ఆయుష్మాన్ ఖురానా సినిమా! 20 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి చూపించి ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపు

భూ సమస్యలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యంజిల్లా కలెక్టర్ కె. హైమావతి

Select Suryaa Now
భూ సమస్యలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యంజిల్లా కలెక్టర్ కె. హైమావతి

సిద్దిపేట, : రాష్ట్ర ప్రభుత్వం భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం అందించాలనే లక్ష్యంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి భూముల రీ సర్వే ప్రక్రియను పారదర్శకంగా, కచ్చితత్వంతో నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కె. హైమావతి తెలిపారు. శుక్రవారం గజ్వేల్ మండలం ఆరేపల్లి గ్రామంలోని గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించిన భూభారతి–భూముల రీ సర్వేపై అవగాహన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

103 గ్రామాల్లో రీ సర్వే

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో భూముల రీ సర్వేలో భాగంగా మొదటి, రెండో విడతల్లో మొత్తం 103 గ్రామాల్లో సర్వే పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు. తొలుత చిన్న గ్రామాలను ఎంపిక చేసుకొని, అక్కడి భూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. భూ రికార్డుల్లో స్పష్టత తీసుకురావడంతో పాటు భవిష్యత్తులో వివాదాలు తలెత్తకుండా చూడటమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.

ఆరేపల్లిలో 656 ఎకరాల సర్వే

గజ్వేల్ మండలం ఆరేపల్లి గ్రామ పరిధిలోని 656 ఎకరాల్లో రీ సర్వే చేపట్టనున్నట్లు కలెక్టర్ తెలిపారు. తొలుత ప్రభుత్వ భూములు, ప్రభుత్వ స్థలాలు, గ్రామ సరిహద్దులను సర్వే చేసిన అనంతరం పట్టా భూముల సర్వే నిర్వహిస్తామని వివరించారు. సర్వే ప్రక్రియలో ప్రతి భూమికి సంబంధించిన హద్దులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, రికార్డుల ఆధారంగా స్పష్టత తీసుకురావడానికి చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు.

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సర్వే

భూముల రీ సర్వేలో అధునాతన రోవర్ యంత్రాలను వినియోగిస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. జీపీఎస్ ఆధారిత సాంకేతిక పరిజ్ఞానం, ట్రాకింగ్ విధానాలతో భూముల హద్దులను కచ్చితంగా గుర్తించి, పారదర్శకంగా సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం వినియోగం ద్వారా భూ కొలతల్లో కచ్చితత్వం పెరగడంతో పాటు భూ యజమానులకు తమ భూముల హద్దులపై స్పష్టత లభిస్తుందని పేర్కొన్నారు.

రైతులు సర్వే ప్రక్రియను గమనించాలి

రోజువారీగా సర్వేయర్, జీపీఓ, రెవెన్యూ రికార్డుల సహకారంతో సుమారు 35 నుంచి 40 ఎకరాల వరకు సర్వే నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. సర్వే జరిగే సమయంలో సంబంధిత భూ యజమానులు, రైతులు తప్పనిసరిగా తమ భూముల వద్ద ఉండి హద్దులను పరిశీలించాలని సూచించారు. హద్దుల విషయంలో ఏవైనా అభ్యంతరాలు లేదా సందేహాలు ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని, అవసరమైతే నిబంధనల ప్రకారం మరోసారి సర్వే చేయించుకోవచ్చని వివరించారు.

భూ సమస్యలు లేని గ్రామాలే లక్ష్యం

గ్రామాల్లో భూ సమస్యలను పరిష్కరించి, భవిష్యత్తులో వివాదాలకు తావులేని పరిస్థితులను కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ లక్ష్య సాధనలో భూ యజమానులు, రైతులు అధికారులకు పూర్తిస్థాయిలో సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రీ సర్వే ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, ప్రతి ఒక్కరి భూమికి సంబంధించిన వివరాల్లో స్పష్టత ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో ఏడీ సర్వే అండ్ ల్యాండ్స్ సుదర్శన్, గజ్వేల్ తహసీల్దార్, గ్రామ సర్పంచ్, సర్వే అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.