అనధికార నిర్మాణాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ టీం తనిఖీలు
సూర్య,భీమ్‌గల్,:భీమ్‌గల్ పట్టణంలో అనధికార నిర్మాణాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. శుక్రవారం భీమ్‌గల్ తహసీల్దార్ కార్యాలయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ టీం సమావేశం నిర్వహించారు. అనంతరం పట్టణంలో నిర్మిస్తున్న అనధికార కట్టడాలను ఎన్‌ఫోర్స్‌మెంట్ టీం ఆధ్వర్యంలో అధికారులు తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ టీం హెడ్, తహసీల్దార్ మాట్లాడుతూ పట్టణ ప్రజలు నూతన గృహ నిర్మాణాలు చేపట్టే ముందు మున్సిపల్ శాఖ నుంచి తప్పనిసరిగా అనుమతులు పొందాలని సూచించారు. అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే తెలంగాణ పురపాలక చట్టం–2019 ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ తనిఖీల్లో తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారి, ఆర్‌అండ్‌బీ ఏఈ, ఫైర్ ఆఫీసర్ తదితర అధికారులు పాల్గొన్నారు.