ORR పై రోడ్డు ప్రమాదం - మహిళ మృతి, ఒకరికి తీవ్ర గాయాలు
కడ్తాల్( రంగారెడ్డి), మేజర్ న్యూస్::కడ్తాల్ మండలం న్యామంతపూర్ గ్రామానికి చెందిన ఓర్చా లవ్వయ్య భార్య ORR పై జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందగా, వారికుప్పల చంద్రమకు తీవ్ర గాయాలయ్యాయి.
పోలీసుల కథనం ప్రకారం, గురువారం ORR పై వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. మృతురాలి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించగా, గాయపడిన చంద్రమను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మృతురాలి కుటుంబానికి, గాయపడిన కుటుంబానికి గ్రామస్తులు సంతాపం తెలిపారు.