నూతన గ్రామపంచాయతీ భవనానికి భూమి పూజ
ఆత్మకూరు/ మేజర్ న్యూస్: ఆత్మకూరు మండలం కత్తెపల్లి గ్రామంలో శుక్రవారం రాష్ట్ర మంత్రి వాకిట్లో శ్రీహరి ఆదేశానుసారం నూతనంగా మంజూరైన గ్రామపంచాయతీ భవనానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ పరిపాలనకు సౌలభంగా ఉండేందుకు నూతన గ్రామపంచాయతీ ఎంతో ఉపయోగపడుతుందని గ్రామస్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీరామ్ రెడ్డి ,కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి తులసిరాజు, మండల నాయకులు ఆర్ పరమేష్, సర్పంచ్ దోమ శ్రీనివాస్ రెడ్డి, ఉపసర్పంచ్, వార్డ్ మెంబర్లు ,గ్రామ కార్యదర్శి నస్రిన్ బేగం ,ఫీల్డ్ అసిస్టెంట్ గ్రామ కాంగ్రెస్ పార్టీ పెద్దలు మహిళలు పాల్గొన్నారు.
_రాజారత్నం, ఆత్మకూరు వనపర్తి జిల్లా.