BREAKING
నో ఆక్షన్ ప్రాజెక్ట్‌తో ఓటీటీ ఎంట్రీ ఇవ్వడానికి భయపడిన సన్నీ డియోల్.. 'ఇక్కా' వెనుక ఆసక్తికర విషయాలు వెల్లడించిన నెట్‌ఫ్లిక్స్! ఢిల్లీ సభకు మక్తల్ నుంచి కాంగ్రెస్ శ్రేణుల తరలింపు కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతూ బస్సులో ప్రయాణించిన మంత్రి వాకిటి శ్రీహరి బాక్సాఫీస్ వద్ద 'ఉడ్తా తీర్' హవా.. తొలి వారంలో రూ.30 కోట్ల క్లబ్‌లో ఆయుష్మాన్ ఖురానా సినిమా! 20 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి చూపించి ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపు ఓటర్ల సౌకర్యార్థం ప్రత్యేక హెల్ప్ లైన్ --- కమిషనర్ నందన్ కన్నెపల్లిలో ఉచిత నేత్ర వైద్య శిబిరం కట్టంగూర్ పోలీస్ స్టేషన్‌లో నూతన ఎస్‌హెచ్‌ఓగా క్రాంతి కుమార్ బద్రీనాథ్‌ నుంచి వస్తున్న హెలికాప్టర్‌ ప్రమాదం.. జోషీమఠ్‌ సమీపంలో 6 మంది దుర్మరణం నూతన గ్రామపంచాయతీ భవనానికి భూమి పూజ ORR పై రోడ్డు ప్రమాదం - మహిళ మృతి, ఒకరికి తీవ్ర గాయాలు అనధికార నిర్మాణాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ టీం తనిఖీలు ప్రజా ప్రభుత్వానికి నీతులు చెప్పే అర్హత బీఆర్ఎస్‌కు లేదు టిపిసిసి అధికార ప్రతినిధి గౌరీ సతీష్ తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ సంచాలకుల ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడటమే కాంగ్రెస్ లక్ష్యం మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలి సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్

మెదక్ ఆర్‌డీఓ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం

Select Suryaa Now
మెదక్ ఆర్‌డీఓ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం

మెదక్ ; శుక్రవారం మెదక్ ఆర్‌డీఓ కార్యాలయంలో 34-మెదక్ అసెంబ్లీ నియోజకవర్గ ఆర్‌డీఓ మరియు ఎన్నికల నమోదు అధికారి (ఈఆర్‌ఓ) డాక్టర్ కె. రామాదేవి ఆధ్వర్యంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్  కార్యక్రమం పొడిగింపు మరియు సవరించిన షెడ్యూల్ గురించి వివరించారు. నోటీసుల జారీ, విచారణ మరియు పరిష్కార ప్రక్రియ గడువును నవంబర్ 26వ తేదీ వరకు పొడిగించినట్లు, తుది ఓటర్ల జాబితాను నవంబర్ 30వ తేదీన ప్రచురించనున్నట్లు తెలియజేశారు.అదేవిధంగా నోటీసుల పరిష్కారానికి సంబంధించిన పెండింగ్ నివేదికను రాజకీయ పార్టీల ప్రతినిధులకు వివరించారు. ప్రస్తుతం కేవలం **387 నోటీసులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని**, వాటిని కూడా త్వరలో పరిష్కరించనున్నట్లు తెలిపారు.అలాగే ఫారం-6, ఫారం-6A, ఫారం-7 మరియు ఫారం-8 దరఖాస్తుల పరిష్కార పురోగతి, వాటి ప్రస్తుత స్థితి గురించి వివరించారు.ఈ సందర్భంగా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను పారదర్శకంగా, ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా పూర్తి చేసేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని ఆర్‌డీఓ డాక్టర్ కె. రమాదేవి కోరారు.ఈ కార్యక్రమంలో రాజకీయ పార్టీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు