ఓటర్ల సౌకర్యార్థం ప్రత్యేక హెల్ప్ లైన్ --- కమిషనర్ నందన్
నెల్లూరు, కార్పొరేషన్, మేజర్ న్యూస్ : జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు నెల్లూరు నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఓటర్ల సౌకర్యార్థం ప్రత్యేకంగా హెల్ప్ లైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి సేవలందిస్తున్నామని అదనపు ఎన్నికల అధికారి, కమిషనర్ వై.ఓ. నందన్ శుక్రవారం ప్రకటించారు. పోలింగ్ బూత్, క్రమ సంఖ్య వివరాలు, ఓటర్ వివరాలు తెలుసుకునేందుకు హెల్ప్ లైన్ నెంబర్లు 1800 425 1113, 0861 2356777 ను సంప్రదించాలని సూచించారు. అదేవిధంగా నెల్లూరు నగరపాలక సంస్థ ప్రత్యేకంగా వెబ్ లింకును రూపొందించి ఆన్లైన్ ద్వారా సేవలను అందిస్తుందని, ఓటర్ల సౌకర్యార్థం ఓటరు వివరాలు, పోలింగ్ బూత్ వివరాలు తెలుసుకునేందుకు వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చునని సూచించారు. ఓటర్ ఐడి నమోదు చేయడం ద్వారా లేదా తెలుగు భాషలో కూడా ఓటరు పేరు నమోదు ద్వారా వివరాలను తెలుసుకోగలమని సూచించారు. వివరాలు తెలుసుకోవాల్సిన ఓటర్లు హెల్ప్ లైన్ సహాయం లేదా వెబ్ లింక్ ద్వారా తమకు సంబంధించిన పోలింగ్ బూత్ వివరాలు తెలుసుకోవాలని ఈ సందర్భంగా కమిషనర్ ప్రకటించారు.