BREAKING
ఫోక్స్ అవగాహన కార్యక్రమం ఎల్ వి ప్రసాద్ లో డయాబెటిక్ రెటినోపతి పై అవగాహన ఇందిరమ్మ గృహాలకు భూమి పూజ చేసిన మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ 31 నుండి గీతంలో సౌత్ జోన్ ఇంటర్-యూనివర్సిటీ పురుషుల టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్ పోటీలు వ్యవసాయ పరిశోధనలకు భారత్ లో ప్రతిష్టాత్మక ఐకార్-సీజీఐఏఆర్ సైన్స్ అండ్ పార్టనర్‌షిప్ వీక్‌ నిర్వహణ! ఆస్కార్ అర్హత సాధించిన 'వి వర్ హియర్' షార్ట్ ఫిల్మ్‌తో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా జతకట్టిన ప్రియాంక చోప్రా! ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కల సాకారం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం - జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసు అధికారులు గ్రామాల్లో విస్తృత పర్యటన పిల్లలను కట్టిపడేస్తున్న యానిమేటెడ్ బ్యాక్‌గ్రౌండ్స్ సీతారామ భద్ర క్షేత్ర నిర్మాణానికి విరాళాల వెల్లువ చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి,సీనియర్ సివిల్ జడ్జి గోపిక నాగ శ్రావ్య తప్పిపోయిన ప్రైవేట్ హెలికాప్టర్.. రంగంలోకి దిగిన సైన్యం, ఎస్డీఆర్‌ఎఫ్ రెస్క్యూ బృందాలు! పేలవంగా సాగిన మండల సర్వసభ్య సమావేశం! బనస్కాంతలో రూ.14 వేల కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభం భారత్‌పై భారీ విజయంతో సిరీస్‌లో ఖాతా తెరిచిన కివీస్!

ప్రజా ప్రభుత్వానికి నీతులు చెప్పే అర్హత బీఆర్ఎస్‌కు లేదు టిపిసిసి అధికార ప్రతినిధి గౌరీ సతీష్

Select Suryaa Now
  ప్రజా ప్రభుత్వానికి నీతులు చెప్పే అర్హత బీఆర్ఎస్‌కు లేదు టిపిసిసి అధికార ప్రతినిధి గౌరీ సతీష్

 


తెలంగాణ బ్యూరో ప్రతినిధి: ప్రజా ప్రభుత్వానికి నైతిక హక్కుల గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ నాయకులకు లేదని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గౌరీ సతీష్ విమర్శించారు. ‘నీళ్లు, నిధులు, నియామకాలు’ అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్.. ఆ నినాదానికి విరుద్ధంగా రాష్ట్ర సంపదను దోచుకుందని ఆరోపించారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని ప్రభుత్వ భూములను గత బీఆర్ఎస్ పాలకులు విక్రయించి, కుటుంబ సభ్యులకు, అనుచరులకు కట్టబెట్టారని గౌరీ సతీష్ ఆరోపించారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా సుమారు రూ.1.50 లక్షల కోట్ల విలువైన ప్రజా ఆస్తులను పరిరక్షించామని వెల్లడించారు. సంపదను సృష్టించడం, ఆ సంపదను ప్రజలకు పంపిణీ చేయడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రిమండలి రాష్ట్ర అభివృద్ధి కోసం రాత్రింబవళ్లు శ్రమిస్తుంటే, బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వంపై నిరాధార విమర్శలు చేస్తూ అవాకులు చవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. ఎల్‌నినో ప్రభావంతో సంభవించిన ప్రకృతి వైపరీత్యాలను రాజకీయాలకు వాడుకోవడం సరికాదని గౌరీ సతీష్ అన్నారు. ప్రకృతి విపత్తుల వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో బాధితులకు అండగా నిలవాల్సింది పోయి, వాటిని వక్రీకరిస్తూ శవరాజకీయాలు చేయడం తగదని హితవు పలికారు. ప్రజా ఆస్తుల పరిరక్షణ, రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు.
ఎ.రవీందర్‌ సూర్య తెలంగాణ బ్యూరో ప్రతినిధి