BREAKING
భారత్, బెల్జియం, లక్సెంబర్గ్ దేశాల కీలక భేటీ అద్విత ఇంటర్నేషనల్ స్కూల్‌లో విద్యార్థులకు దంత వైద్య పరీక్షలు టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి 100 కుటుంబాల చేరికలు: విక్షిత్ భారత్ 2047 సాధనలో గ్రామాలను సాధికారత వైపు నడిపించడమే కీలకం రెవెన్యూ దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం వద్దు - జిల్లా అదనపు కలెక్టర్ వి రాములు 'తేజాబ్' సినిమా షూటింగ్ ఎక్కడ జరిగిందో తెలుసా?.. షారుఖ్ ఖాన్ 'మన్నత్'పై అనిల్ కపూర్ ఆసక్తికర జ్ఞాపకాలు! బీఆర్ఎస్‌లో కాంగ్రెస్ నాయకులు చేరారన్న ప్రచారంలో వాస్తవం లేదు చరిత్ర సృష్టించిన అర్ష్‌దీప్ సింగ్ ఎన్నిక విధులను బాధ్యతతో నిర్వహించాలి..... * ఎంపిడిఓ రవికుమార్ * 250కి పైగా సినిమాల్లో నటించినా.. అందులో కేవలం 11 మాత్రమే మంచి సినిమాలని భావిస్తున్నా: పరేష్ రావల్ సంచలన వ్యాఖ్యలు! 28వ డివిజన్‌లో నన్నం శ్రీనివాసులు విస్తృత ప్రచారం రీ-సర్వే పనులను పరిశీలించిన అదనపు కలెక్టర్ గుంటూరు: విజిలెన్స్ అధికారుల ఆకస్మిక తనిఖీలు జీవితాంతం దేశం కోసం అంకితమవుతానని ప్రధాని మోదీ ప్రతిజ్ఞ! తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం

ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలి సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్

Select Suryaa Now
ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలి  సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్

ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలి

సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్

మిర్యాలగూడ అర్బన్, మేజర్ న్యూస్: ఎల్‌నినో ప్రభావంతో భవిష్యత్తులో ఎదురయ్యే వాతావరణ మార్పులు, వాటి ప్రభావాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు చేపట్టాల్సిన ముందస్తు నివారణ చర్యలపై మిర్యాలగూడలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఎమ్మెల్సీ శ్రీ కేతావత్ శంకర్ నాయక్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎల్‌నినో ప్రభావం వల్ల వ్యవసాయం, తాగునీటి సరఫరా, సాగునీటి రంగాలపై పడే ప్రభావాలను సమావేశంలో చర్చించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్సీ సూచించారు. అవసరమైన ముందస్తు ప్రణాళికలు రూపొందించి, నివారణ చర్యలను పకడ్బందీగా అమలు చేయాలని అధికారులకు సూచించారు.

వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ, ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.

ఈ సమావేశంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి చిలుకూరి సుధా బాలు, వైస్ చైర్‌పర్సన్ శ్రీమతి గుడిపాటి శిరీష నవీన్, జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, అదనపు కలెక్టర్, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.