telangana
తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం
సూర్య కౌటాల : మండలంలోని కన్నెపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో తెలంగాణ గ్రామీణ బ్యాంకు యాజమాన్యం ఆధ్వర్యంలో శుక్రవారం గ్రామ ప్రజలకు బ్యాంకింగ్ సేవలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా బ్యాంకు అధికారులు గ్రామ ప్రజలకు బ్యాంకు నిబంధనలు, వివిధ బ్యాంకింగ్ సేవలు, పాలసీలు, ఖాతాదారులకు అందుబాటులో ఉన్న సౌకర్యాల గురించి వివరించారు. బ్యాంకు సేవలను సక్రమంగా వినియోగించుకోవడం, ఆర్థిక లావాదేవీల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.గ్రామీణ ప్రాంత ప్రజలకు బ్యాంకింగ్ సేవలపై అవగాహన పెంపొందించడం, బ్యాంకు ద్వారా అందించే సేవలు మరియు పథకాల గురించి తెలియజేయడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ గ్రామీణ బ్యాంకు ప్రతినిధులు, గ్రామపంచాయతీ పాలకవర్గం, సిబ్బంది మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.