BREAKING
దుత్తలూరులో టీడీపీ అభ్యర్థులకు మద్దతుగా ఇంటింటి ప్రచారం అభివృద్ధిని చూసి ఆశీర్వదించండి దేశ ప్రధాని పాల్గొననున్న డీజీపీలు, ఐజీపీల కాన్ఫరెన్స్ నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలి.........జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ భార్య గౌరీ స్ప్ర్యాట్‌తో మొదటి కర్వా చౌత్ జరుపుకున్న అమీర్ ఖాన్.. అనిల్ కపూర్ ఇంట్లో తారల సందడి! ఇచ్చిన హామీలన్నిటిని అమలు చేస్తున్నాం జేసన్ స‌ంజయ్ పేరుతో ఫేక్ అకౌంట్లు.. అభిమానులకు కీలక హెచ్చరిక పూ ఐకానిక్ లుక్‌ను రీక్రియేట్ చేసిన ఓర్రీ.. ఆలియా భట్ నవ్వుల వర్షం, కరీనా కపూర్ ఫిదా! రైతుల సమస్యలను పరిష్కరించాలి – బీజేపీ నాయకుల డిమాండ్ ప్రారంభోత్సవం ఆర్భాటం... కొనుగోళ్లలో మాత్రం శూన్యం! --నెల రోజులైనా పెసల కొనుగోళ్లు ప్రారంభించని అధికారులు.. --మార్క్‌ఫెడ్ కేంద్రం చుట్టూ రైతుల ప్రదక్షిణలు.. --ఉన్నతాధికారులు స్పందించాలని అన్నదాతల డిమాండ్ శూర్పణఖ అత్యంత తప్పుగా అర్థం చేసుకున్న పాత్ర.. రామాయణంపై వినూత్న వ్యాఖ్యలు చేసిన రకుల్ ప్రీత్ సింగ్! కేరళ SIRపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. గడువు పొడిగింపునకు నో, ఓటర్ల ఫిర్యాదులపై ECI విచారణ నో ఆక్షన్ ప్రాజెక్ట్‌తో ఓటీటీ ఎంట్రీ ఇవ్వడానికి భయపడిన సన్నీ డియోల్.. 'ఇక్కా' వెనుక ఆసక్తికర విషయాలు వెల్లడించిన నెట్‌ఫ్లిక్స్! ఢిల్లీ సభకు మక్తల్ నుంచి కాంగ్రెస్ శ్రేణుల తరలింపు కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతూ బస్సులో ప్రయాణించిన మంత్రి వాకిటి శ్రీహరి బాక్సాఫీస్ వద్ద 'ఉడ్తా తీర్' హవా.. తొలి వారంలో రూ.30 కోట్ల క్లబ్‌లో ఆయుష్మాన్ ఖురానా సినిమా! 20 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి చూపించి ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపు

నాలుగో వార్డును అభివృద్ధి పథంలో నడిపిస్తా!

Select Suryaa Now
నాలుగో వార్డును అభివృద్ధి పథంలో నడిపిస్తా!

కుప్పం, మేజర్ న్యూస్:కుప్పం పురపాలక సంఘం ఎన్నికల నేపథ్యంలో టోటల్ ఆంధ్ర ప్రపంచ దేశాలు చూస్తుంది గురువారం  ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రాజకుమార్ గంగమ్మ గుడి చైర్మన్ రవిచంద్రబాబు మాజీ ఎంపీటీసీ  జి వెంకటేష్  నాలుగో వార్డ్  పార్టీ అధ్యక్షులు ఎస్ రాజా ఆర్ శ్యామరాజు చలపతి తో పాటు పలువురు టిడిపి నాయకులు అధిక సంఖ్యలో ఇంటింటా ప్రచారం 

 పట్టణంలోని నాలుగో వార్డులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గాయత్రి గౌరప్ప ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. వార్డులోని , వినాయకపురం, , బైరుగానిపల్లి తదితర ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకుంటూ తనకు మద్దతు ఇవ్వాలని అభ్యర్థించారు. స్థానికులతో మమేకమవుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వార్డు అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇస్తూ ప్రచారంలో ముందుకు సాగారు.

ప్రజల సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యం

నాలుగో వార్డులోని ప్రజలు ఎదుర్కొంటున్న స్థానిక సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని గాయత్రి గౌరప్ప తెలిపారు. వార్డులో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పించడం, ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయడం తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధిగా ఎన్నికైతే ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తానని చెప్పారు.

చంద్రబాబు నాయకత్వంలో కుప్పం అభివృద్ధికి కృషి

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కుప్పం పట్టణంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటి ప్రచారంలో భాగంగా ప్రజలకు వివరించారు. పట్టణ ప్రగతితో పాటు ప్రతి వార్డులోనూ ప్రజలకు మెరుగైన సదుపాయాలు అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కుప్పం అభివృద్ధిలో నాలుగో వార్డు కూడా భాగస్వామ్యం కావాలంటే ప్రజల సహకారం అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు.

అవకాశం కల్పించండి.. అభివృద్ధి చేసి చూపిస్తా

రానున్న పురపాలక ఎన్నికల్లో నాలుగో వార్డు కౌన్సిలర్‌గా తనను ఆదరించి గెలిపించాలని గాయత్రి గౌరప్ప ప్రజలను కోరారు. తనపై నమ్మకంతో అవకాశం కల్పిస్తే వార్డు అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా, వారి అభిప్రాయాలకు ప్రాధాన్యతనిస్తూ వార్డు అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తానని తెలిపారు. ప్రజల అవసరాలను గుర్తించి, వార్డును మరింత అభివృద్ధి చెందిన ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.

ఇంటింటి ప్రచారంలో భాగంగా ప్రతి కుటుంబాన్ని కలుసుకుంటూ తనకు మద్దతు ఇవ్వాలని ఆమె అభ్యర్థించారు. స్థానిక ప్రజలతో మాట్లాడి వార్డు అభివృద్ధిపై తన ఆలోచనలను వివరించారు. నాలుగో వార్డులో టీడీపీ శ్రేణులతో కలిసి ప్రచారాన్ని ఉత్సాహంగా కొనసాగించారు.

ఈ కార్యక్రమంలో నాలుగో వార్డుకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని గాయత్రి గౌరప్పకు మద్దతుగా ప్రచారం గురువారం ఐదు గంటలకి ప్రచారం ముగింపు సందర్భంగా గౌరప్ప గాయత్రి ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు.