14 డివిజన్లో హోరెత్తించిన వైసీపీ ఎన్నికల ప్రచారం.
నెల్లూరు రూరల్, మేజర్ న్యూస్ : వైసీపీ అభ్యర్థులకు కోలాటాలతో ఘన స్వాగతం పలికిన మహిళలు నెల్లూరు నవాబు పేట కుసుమ హరిజనవాడ, FCI కాలనీ, నజీర్ తోట ప్రాంతాల్లో జరిగిన వైసిపి ..ఎన్నికల ప్రచార కార్యక్రమానికి వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్ చార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి . వైసిపి మేయర్ అభ్యర్థి ఆనం విజయకుమార్ రెడ్డి హాజరై. 14వ డివిజన్ వైసిపి కార్పొరేటర్ అభ్యర్ది ధనుజా రెడ్డి తో ..ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా మహిళలు ప్రత్యేకంగా కోలాటాలతో అభ్యర్థులకు స్వాగతం పలికారు.
అనంతరం జరిగిన రోడ్ షో కార్యక్రమంలో మేయర్ అభ్యర్థి ఆనం విజయకుమార్ రెడ్డి, 14వ డివిజన్ వైసిపి కార్పొరేటర్ అభ్యర్థి ధనుజా రెడ్డి గారు..ప్రజలు ఫ్యాన్ గుర్తుకు ప్రజలు ఓటు వేసి .. తమను గెలిపించాలని ప్రజలను కోరారు. నవంబర్ 1న జరగబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మేయర్ గా ఆనం విజయ కుమార్ రెడ్డి ని, 14వ డివిజన్ కార్పొరేటర్ గా ధనూజ రెడ్డి ని అఖండ మెజారిటీతో గెలిపించాలని.. ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కూటమి ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వలన...నెల్లూరు నగరపాలక సంస్థ అప్పుల ఊబిలో కూరుకుపోయి.. అవినీతి రాజ్యమేలుతుందన్నారు. ఈ అవినీతిని పెకలించి వేయాలంటే ప్రజలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని గెలిపించాలని కోరారు.