బోయినపల్లి గురుకుల విద్యార్థుల చిత్రకళకు జిల్లా పాలనాధికారి ప్రశంసలు
సూర్య రాజన్న సిరిసిల్ల: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు చదువుతో పాటు పలు రంగాల్లో ప్రతిభ కనబరుస్తున్నారని జిల్లా పాలనాధికారి గరిమ అగ్రవాల్ తెలిపారు. బోయినపల్లిలోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలకు చెందిన పదవ తరగతి విద్యార్థులు కె.వెంకటేష్ బాబు, కె.కార్తీక్, కె.శ్రీవాస్తవ్, యు.రాణా ప్రతాప్ వేసిన చిత్రాలను శుక్రవారం సమీకృత కార్యాలయాల సముదాయంలో పరిశీలించి అభినందించారు. గురుకుల విద్యా సంస్థల రాష్ట్ర స్థాయి పోటీల్లో, సాంకేతిక ధ్రువీకరణ పరీక్షలో అర్హత సాధించారని కొనియాడారు. ప్రతి విద్యార్థి చదువుతో పాటు తమకు ఇష్టమైన అంశాల్లో నైపుణ్యం సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బోయినపల్లి మండల ప్రత్యేక అధికారి, ఉద్యాన శాఖ అధికారి శరత్ బాబు, కళాశాల ప్రధానాచార్యులు విశ్వనాథం, చిత్రకళ ఉపాధ్యాయిని వీణా దేవి, విద్యార్థులు పాల్గొన్నారు.
.