డోన్‌లో రూ.1.47 లక్షల నగదు సీజ్: 16 మంది వైకాపా నాయకుల అరెస్ట్
డోన్, మేజర్ న్యూస్): డోన్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు డబ్బులు పంపిణీ చేస్తూ ఓటర్లను ప్రలోభపెడుతున్న 16 మంది వైకాపా నాయకులను శుక్రవారం ఉదయం పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులకు అంది నమ్మదగిన సమాచారం మేరకు పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో దాడులు నిర్వహించి వీరిని పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు.అరెస్టయిన నాయకుల వద్ద నుంచి రూ.1,47,500 నగదును స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు వెల్లడించారు. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడినా, ఓటర్లను ప్రలోభాలకు గురిచేసినా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు.
సూర్య ప్రతినిధి వెంకటేష్ నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం