స్వర్ణ వైద్యశాలను సందర్శించిన బాపట్ల జిల్లా మలేరియా అధికారి నాగార్జున రావు
కారంచేడు, మేజర్‌న్యూస్ : కారంచేడు మండలం స్వర్ణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఈరోజు జిల్లా మలేరియా అధికారి వి నాగార్జున రావు సందర్శించారు. జాతీయ కీటక జనిత వ్యాధుల నిర్మూలన కోసం ఈరోజు కొడవలి వారి పాలెం సబ్ సెంటర్ మరియు స్వర్ణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లాబరేటరీ లోని అందరూ ఏఎన్ఎంలు ఆశ వర్కర్ల రికార్డులు పరిశీలించారు సంతృప్తి వ్యక్తం చేశారు.
దోమల ద్వారా వచ్చే వ్యాధులు మలేరియా డెంగ్యూ బోదకాలు వంటివి నిర్మల కోసం ప్రతి ఒక్కరూ గ్రామాల్లో మురికి నీటి నిలువలు లేకుండా చేయాలని ప్రస్తుతం వర్షపు నీళ్ళు నిల్వ ఉన్నచోట పురుగు నీళ్లలో దోమలు పుట్టకుండా లార్వా పెరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజల్లో అవగాహన కల్పించాలని నీటి నిల్వలు లేకుండా ఫ్రైడే ఫ్రైడే కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు అనంతరం లాబరేటరీలో అన్ని రికార్డులను ,రక్తపూతలను మరియు స్టైనింగ్ విధానం స్లైడ్స్ ను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎం శాలిని, చీరాల 2,సబ్ యూనిట్ ఆఫీసర్ శ్రీ రవి బాబు, ఎంపీహెచ్ఓ శ్రీ వి నాగేశ్వరరావు, ల్యాబ్ టెక్నీషియన్ శ్రీ బయ్య.శంకర్ హెచ్.పీ శ్రీమతి.మాధురి సి పోరా ఏఎన్ఎంలు వి నాగలక్ష్మి కే మాధవి, అరుణ, శారద, ఫార్మసి ఆఫీసర్ జ్యోత్స్న, స్టాఫ్ నర్స్ మల్లేశ్వరి, ఎం ఎల్ హెచ్ పి లు అనూష, అశ్విని, ఆశాలు సింగమ్మ మరియమ్మ పద్మ, తదితరులు పాల్గొన్నారు.